హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ జిల్లాలో ఆర్టీసీ బస్సెక్కాలంటేనే హడలిపోతున్న జనం.. అంతగా భయపెట్టిన విషయం ఏంటంటే..!

ఆ జిల్లాలో ఆర్టీసీ బస్సెక్కాలంటేనే హడలిపోతున్న జనం.. అంతగా భయపెట్టిన విషయం ఏంటంటే..!

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులంటేనే హడలిపోతున్న జనం

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులంటేనే హడలిపోతున్న జనం

ఒకప్పుడు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అంటూ ప్రతి బస్సు వెనక రాసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అసలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే జనం భయపడే స్థితికి వచ్చింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా (Kurnool District) లో బస్సంటేనే హడలిపోతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  ఒకప్పుడు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అంటూ ప్రతి బస్సు వెనక రాసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అసలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే జనం భయపడే స్థితికి వచ్చింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా (Kurnool District) లో బస్సంటేనే హడలిపోతున్నారు. ఎందకంటే గత రెండేళ్లుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు అనేక ప్రమాదాలకు గురయ్యాయి. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే కర్నూలు కోడుమూరు ప్రధాన రహదారిలో ఎమిగనూరు డిప్పోకి చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలుకు వస్తుండగా బస్సు వెనకవైపు రెండు చక్రాలు ఉడిపోయి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.

  ముఖ్యంగా కర్నూలు నుంచి కోడుమూరు మీదగా ఎమిగనూరు వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడి అద్వానంగా తయారైయింది. ఈ రోడ్డు మార్గంలో అనేకసార్లు ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అయితే ఏకంగా స్టీరింగులు విరిగిపోవడం. టైర్లు ఊడిపోయి బస్సులు ప్రమాదాలకు గురికావడం ఇలా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది.

  ఇది చదవండి: మనకు పులస తెలుసు.. కొర్రమీను తెలుసు.., మరి చీరమీను తెలుసా..? టేస్ట్ ఎలా ఉంటుందంటే..!

  గడిచిన రెండు నెలలోనే 8 బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. వీటి నిర్వహణ లోపమో లేక అస్తవ్యస్తామైన రోడ్లు నిర్వహణ మూలంగానో అర్ధం కావడం లేదు ఆర్టీసీ బస్సులు మాత్రం నిత్యం ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే సంకోచిస్తున్నారు.

  ఇది చదవండి: దుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టిన రోజా.. మంత్రిగారి మొక్కు అందుకే..!

  ఈ నేపథ్యంలోనే డొక్కు బస్సులు మాకొద్దు కొత్త బస్సులు కావాలంటూ పట్టణ పౌర సంక్షేమ సంఘం(PPSS) ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట బస్టాండ్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ధర్నాకు ఎం నాగరాజు అధ్యక్షత వహించారు. ధర్నాను ఉద్దేశించి PPSS రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి, నగర నాయకులు ఎస్ నౌషాద్ మాట్లాడుతూ రోడ్లపై టైర్లూడిపోతూ ప్రయాణికులు తోస్తే తప్ప స్టార్ట్ గాని డొక్కు ఆర్టీసీ బస్సుల ప్రయాణం ప్రమాదకరంగా మారిందని విమర్శించారు.

  మెకానిక్‌ల కొరతతో బస్సులు రిపేర్లు కూడా సక్రమంగా జరగడంలేదు. ఎవరు ఏమైతే నాకేం అన్నట్లుగా ఆర్టీసీ ప్రధానాధికారి ఆఫీసుకే పరిమితయ్యారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఒకపక్క రోడ్ల నిర్మాణం కోసం అంటూ వేల కోట్లు అప్పులు చేస్తూ మరోపక్క పెట్రోల్ డీజిల్‌పై రోడ్డు సెస్సు అంటూ వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. కనీసం ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు కూడా చేయడం లేదని విమర్శించారు. గుంతలు పడ్డరోడ్లు, డొక్కు బస్సులు ప్రజలకు నరకం చూపిస్తున్నాయన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రోడ్లు మరమ్మత్తులు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీని కాపాడాలని కోరారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Apsrtc, Kurnool, Local News

  ఉత్తమ కథలు