Murali Krishna, News18, Kurnool
ఆ ఊళ్లో రాత్రయితే చాలు జనమంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇంటికి తాళం వేసుంటే చాలు అక్కడంతా అరాచకమే. ఎటు నుంచి వస్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఇళ్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని పట్టణంలో వరుస దొంగతనాలతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక నిర్మల్ థియేటర్ ఎదురుగా రోడ్డు పక్కనే ఉంచిన ద్విచక్ర వాహనం చోరికి గురైంది. స్థానిక కళ్ళు బావీ వీధికి చెందిన రవి అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఆదోని పట్టణంలోని నిర్మల్ థియేటర్ ఎదురుగా రోడ్డు పక్కన పార్క్ చేసి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఎవరో గుర్తుతెలియని దుండగులు తన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు.
ఆదోని పట్టణ పరిసర ప్రాంతంలో ఒక వీధిలో రామయ్య అనే వ్యక్తి ఇంట్లో దుండగులు పట్టపగలే చోరీకి యత్నించారు. పని నిమిత్తం కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చేసరికి తాళం వేసిన ఇంటికి దొంగలు కన్నం వేశారు. ఇంట్లోని బీరువాలోని నాలుగు తులాల నగలు, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.ఆదోని పట్టణంలో వరుస దొంగతనాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారనేది ఈ ఘటనలు చూస్తే అర్థం అవుతోందని ప్రజలు తివ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో బంగారు బజారులోని జబ్బార్ జువెల్లర్ లో భారీ చోరీ జరిగింది. దానిని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినప్పుటికిఅది మరువకముందే వారం పది రోజుల వ్యవధిలో ఒకే కాలనీలో వరుసగా మూడు ఇళ్లలో దొంగతనలు జరిగాయి.
ఇలా కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో వరస దొంగతనాలతో నిత్యం ఏదో ఒకచోట దొంగతనాలు జరుగుతూ ఉండడం ప్రజలను తీవ్రంగా కలచివేస్తుంది. పట్టణంలోని ప్రజలు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా ఒంటరిగా వదిలేసి వెళ్లాలన్నా ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి దొంగతనంచేస్తారోనని బిక్కుబిక్కుమంటు కాలం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది చదవండి: పాడుపనులు చేస్తున్నా పట్టించుకోరు.. ఎక్కడో తెలుసా..?
పోలీసులు దీనిపై గట్టిగా నిఘాఉంచి ముఖ్యంగా రాత్రి సమయంలో గస్తీ పెంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరో వైపు జిల్లా ఎస్పీ సిధార్థ్ కౌశల్ మాత్రం కర్నూలులో జరిగే దొంగతనాలను త్వరగా ఛేదిస్తున్నారు. అదే పనితీరుతో ఆదోనిపై కూడా దృష్టిసారించి తమకురక్షణ కల్పించాలంటూ ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News