Murali Krishna, News18, Kurnool
కొందరు మతిస్థిమితం లేక చేసే పనులు జనాలను హడలెత్తిస్తుంటాయి. కానీ కొందరు మానసిక సమస్యలతో సైకోలుగా మారుతుంటారు. అలాంటి వారు జనాన్ని బెంబేలెత్తిస్తుంటారు. అలాంటి సైకో కర్నూలు జిల్లా ప్రజలను హడలెత్తించాడు. కర్నూలు జిలలా పత్తికొండలో సైకో వీరంగానికి జనం పరుగులు పెట్టారు. అది కూడా పోలీస్ స్టేషన్ ఎదురుగానే సైకోయిజాన్ని ప్రదర్శించాడు. జనాలపై దాడి చేయడమే కాకుండా.. రోడ్డుపై వెళ్లే వాహనాలపై రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిపై ఇనుప రాడ్డుతో దాడికి యత్నించడంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇదంతా పోలీస్ స్టేషన్ ఎదుటే జరుగుతున్నా ఎవరూ అటువైపు వెళ్లలేదు.
ఓ ఆర్టీసీ బస్సుపైకి రాళ్లు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కండక్టర్, డ్రైవర్ ఫిర్యాదు చేసిన తర్వాతే పోలీసులు స్పందించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకోని విచారించగా.. సదరు సైకో హోసూరు గ్రామానికి చెందిన కు చెందిన వన్నూరు సాహెబ్ గా స్థానికులు గుర్తించారు. ఐతే దీనిపై పోలీసులు కూడా సరిగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం.
పోలీస్ స్టేషన్ ఎదుట సైకో వీరంగం వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే పోలీసులు కనీసం స్పందించపోవడం, సమాధానం చెప్పకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. పొరబాటున అతడి దాడిలో ఎవరైనా గాయపడి ఉంటే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఘటన ఎక్కడో మారుమూల జరిగితే ఫర్వాలేదు.. కానీ పోలీస్ స్టేషన్ వద్దే జరిగినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News