(T. Murali Krishna, News18, Kurnool)
కర్నూల్ నగరంలోని స్థానిక జిల్లా అవుట్ డోర్ స్టేడియం ముందున్న స్టేడియాల ప్రైవేటీకరణ ఆపాలని.. పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను రద్దు చేయడంతో పాటు శిక్షణ ఇచ్చే కోచ్‌లపై ఒత్తిడి తగ్గించాలని.. క్రీడలకు ప్రభుత్వం సెపెరేట్ బడ్జెట్ కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరుతూ... కర్నూలులోని క్రీడాకారులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుస్సేన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు సుంకన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాల ప్రైవేటీకరణ పే అండ్ ప్లే విధానాన్ని ప్రవేశపెట్టడి.. పేద మధ్యతరగతి క్రీడాకారులకు, రోజు వ్యాయామం చేసుకునే వారికి స్టేడియాలను దూరం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి.. వారిపైన ఆర్థిక భారాన్ని మోపడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
Anantapur : 'ఓళిగా'.. అనంతలో అందరినీ ఫిదా చేసే పిండి వంటకం
ఇప్పటికే కర్నూలు నగరంలోని స్విమ్మింగ్ పూల్‌ను ఇండోర్ స్టేడియం,జోరాపురం వద్ద ఉన్న స్టేడియంను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని తెలిపారు. ఇలాంటి హేయమైన చర్యలను తక్షణమే స్టేడియాల ప్రైవేటీకరణ ఆపాలని పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి నీచంగా వ్యాయామం చేసేవారి నుండి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి చర్యలను అధికారులు వెంటనే విరమించుకోవాలని కోచ్‌లపై ఒత్తిడిని తగ్గించాలన్నారు.ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక బడ్జెట్నుకేటాయించిక్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న వైయస్సార్ ప్రస్థాగ బహుమతులను వెంటనే అందించాలని డీవైఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం వెంటనే జిల్లాలోని వివిధ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను గుర్తుంచి అలాంటి వారికితగిన ప్రోత్సహం అందించే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kurnool, Local News