హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP: వైఎస్ఆర్సీపీలో అత్తాకోడళ్ల వైరం.. కొట్లాట వరకు వెళ్లింది..!

YSRCP: వైఎస్ఆర్సీపీలో అత్తాకోడళ్ల వైరం.. కొట్లాట వరకు వెళ్లింది..!

వైఎస్ఆర్సీపీలో అత్తాకోడళ్ల వైరం

వైఎస్ఆర్సీపీలో అత్తాకోడళ్ల వైరం

వైసీపీ పెద్దల సూచనతో బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అవుకు వచ్చి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులతో వేర్వేరుగా మాట్లాడారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

రిపోర్టర్: మురళీ కృష్ణ

లొకేషన్: కర్నూలు

దివంగతమాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. రామకృష్ణారెడ్డి సతీమణి శ్రీదేవి, ఆయన చిన్న కుమారుడు చల్లా భగీరథ్‌రెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మి మధ్య శుక్రవారం ఉదయం గొడవ చెలరేగడంతో ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. రెండువర్గాల అనుచరుల నినాదాలతో అవుకులో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైసీపీపెద్దల సూచనతో బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అవుకు వచ్చి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులతో వేర్వేరుగా మాట్లాడారు. ఆస్తి పంపకాల్లో తలెత్తిన విభేదాలే సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. సయోధ్య కుదిర్చేందుకు పెద్దలు ప్రయత్నించినట్లు సమాచారం.

గొడవల నేపథ్యంలో చల్లా భగీరథ రెడ్డి సతీమణి శ్రీలక్ష్మిసంచలన వ్యాఖ్యలు చేశారు. గొడవలు సృష్టించి తమను గ్రామం నుంచి వెలివేసేందుకు చల్లా రామకృష్ణారెడ్డి సభ్యులు కుట్ర పన్నారనిఆమె ఆరోపించారు. గ్రామానికి చెందిన రవీంద్రనాథ్‌రెడ్డి తనను కాలితో తన్ని అసభ్యపదజాలంతో దూషించారన్నారు.దాడిపై పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుఆమె వెల్లడించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇంటిని వదలి వెళ్లే ప్రసక్తే లేదనిశ్రీలక్ష్మి స్పష్టం చేశారు.

రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పదవిలో ఉండగా 2021 జనవరి లో మృతి చెందారు. అనంతరం చిన్న కుమారుడు భగీరథ్‌రెడ్డికి వైసీపీఅధిష్ఠానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఆయన 2022 నవంబరులో ఆకస్మికంగా మరణించారు. అప్పటి నుంచి కుటుంబంలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి. విషయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లింది.. దీంతో చల్లా భగీరథ్రెడ్డి సతీమణిశ్రీలక్ష్మికి ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది. ఆతర్వాత ఆమె చురుకుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైసీపీ పెద్దలను కలుస్తూ రాజకీయంగా ఎదుగుతున్నారు.

ఈ నేపథ్యంలో చల్లా రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు చల్లా విఘ్నేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మిగిలిన వారంతా ఆధిపత్యం కోసం శ్రీలక్ష్మిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే అవుకు నుంచి పోటీ చేస్తానని శ్రీలక్ష్మి తెలిపారు.ఈ విభేదాలకు సీఎం జగన్ చెక్ పెడతారా లేక మరో నేతను చూస్తారా అనేది జిల్లాలో చర్చనీయాంశమైంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News

ఉత్తమ కథలు