Murali Krishna, News18, Kurnool
ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) వ్యాప్తంగా కర్ణాటక (Karnataka) సరిహద్దు ప్రాంతాలైన ఆదోని తదితర ప్రాంతాలలో క్రమంగా కర్ణాటక మద్యాన్ని జిల్లాలోకి తరలిస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు కర్నూలు జిల్లా సెబ్ అధికారులు ఆదోని డివిజన్ ప్రాంతంలో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మొబైల్ పార్టీ పోలీసు బృందాన్ని నియమించారు. ఇందులో ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వస్తున్న మద్యం రవాణాను అరికట్టాల్సిన బాధ్యత ఈ స్పెషల్ మొబైల్ పార్టీ పోలీస్ బృందాలపై ఉంది. కానీ ఈ బృందంలోని ఓ ఎస్సైకు సంబంధించిన కారులో అక్రమంగా కర్ణాటక నుంచి ఆదోని ప్రాంతానికి మద్యం తీసుకొస్తుండగా సరిహద్దులో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న కర్ణాటక పోలీసులు వాహనాన్ని పట్టుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కారులో తెస్తున్న నాలుగు బాక్సుల కర్ణాటక మద్యం, టెట్రా ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకొని కారు డ్రైవరుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ అక్రమ రవాణాలో ఎస్సై సైతం కారులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంఘటన వివరాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో జిల్లా సెబ్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప పోలీసు స్టేషన్ కు కర్నూలు జిల్లా సెబ్ అధికారులు వెళ్లి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
కాగా ఈ విచారణలో భాగంగా కారు పట్టుబడిన సమయంలో ఆ వాహనానికి చెందిన ఎస్సై అధికారులు ఉన్నాడా లేడా అనే సమాచారం తెలియాల్సి ఉంది. అయితే పట్టుబడిన సమయంలో ఎస్సై కార్ లోనే ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తుండడంతో. ఒకవేళ ఆ ఎస్ఐ ఆ సమయంలో తప్పించుకుని వెళ్ళుంటాడనే పలువురు చర్చించుకుంటున్నారు. కర్నూలు జిల్లా సెబ్ ఆధికారుల సైతం వివిధ కోణాలలో విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News