హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh : కారులో అనుమానాస్పద బ్యాగు.. తీసి చూస్తే షాక్‌.. అందులో ఏముందంటే..

Andhra Pradesh : కారులో అనుమానాస్పద బ్యాగు.. తీసి చూస్తే షాక్‌.. అందులో ఏముందంటే..

kurnool police

kurnool police

Andhra Pradesh : కర్నూలు జిల్లాలో పోలీసులు ఆకస్మిక తనీఖీలు జరిపారు. ఈ ఆకస్మిక తనీఖీల్లో...

  కర్నూలు జిల్లాలో పోలీసులు ఆకస్మిక తనీఖీలు జరిపారు. ఈ ఆకస్మిక తనీఖీల్లో భారీగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారులు వాహనాలను ఆపి తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారు అటువైపుగా వచ్చింది.. దానిని ఆపి లోపల సోదాలు చేశారు. ఓ బ్యాగులో భారీగా వెండి ఉండటంతో అవాక్కయ్యారు. ఆ వెండికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వెండి 105 కిలోల వరకు ఉందని తేల్చారు. రూ.2 లక్షల 5 వేల డబ్బు, కారును సీజ్ చేశారు. పట్టుబడిన వెండి సేలం నుంచి రవాణా అవుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెండి తీసుకెళ్తున్న వారి నుంచి వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల డబ్బు, బంగారం, వెండి అక్రమ రవాణా పెరిగిపోయింది. ఏపీ సరిహద్దులో ఉన్న కర్నూలు, నెల్లూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

  అక్రమ మద్యంతో పాటూ డబ్బు, బంగారం, వెండి పట్టుబడుతోంది. కృష్ణా జిల్లా సరిహద్దులో రెండు, మూడు రోజుల క్రితం భారీగా డబ్బు, బంగారం, వెండి దొరికిపోయింది. కర్నూలులోని చెక్‌పోస్టులో కూడా గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే వెండి తరలింపు వెనుక స్థానికంగా ఎవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Andhra Pradesh, AP Police, Kurnool, Silver

  ఉత్తమ కథలు