హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: జిల్లాలో ఆగని అక్రమ మద్యం రవాణా... 

Andhra Pradesh: జిల్లాలో ఆగని అక్రమ మద్యం రవాణా... 

జిల్లాలో కొనసాగుతున్న మద్యం రవాణా

జిల్లాలో కొనసాగుతున్న మద్యం రవాణా

Kurnool: కర్నూలు జిల్లా వ్యాప్తంగా అక్రమ మధ్య మరియు నాటు సారా స్థావరాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

T. Murali Krishna, News18, Kurnool

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అక్రమ మధ్య మరియు నాటు సారా స్థావరాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ నాటు స్థావరాలపై,అక్రమ మద్యం రవాణాపై పోలీసుల కొరడా చూపిస్తున్నారు

అక్రమంగా నాటుసారా తయారీ , నిల్వ , అక్రమ మద్యం, అక్రమ రవాణా, అమ్మకాలపై గత వారం రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం, సెబ్ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా దాడులు చేశారని జిల్లా ఎస్పీసిద్దార్థ్ కౌశల్ ఒక ప్రకటనలో వివరాలను విడుదల చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు జిల్లా పోలీసులు సమిష్టిగా నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు .నాటుసారా తయారుచేసే 21 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.విస్తృత దాడులలో (నవంబర్ 07 నుండి ఇప్పటివరకు)

నాటుసారా స్థావరాలపై దాడులు

నాటుసారాపై 10 కేసులు, 10 మంది అరెస్టు , 165 లీటర్ల నాటుసారా సీజ్ ,350 లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం, 1 వాహనం సీజ్ చేయడం జరిగింది.అక్రమ మద్యం పై 33 కేసులు, 50 మంది అరెస్టు , 799.8 లీటర్ల మద్యం సీజ్, 11 వాహానాలు సీజ్.

బైండ్ ఓవర్ కేసుల వివరాలు...

నాటు సారాపై ఇద్దరిని బైండోవర్ చేయడం జరిగింది.అక్రమ మద్యంపై ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది.నాటుసారా పై విస్తృతంగా గ్రామాలలో ఆర్ ఎస్సై , 12 మంది స్పెషల్ పార్టీ పోలీసులచే దాడులు చేస్తున్నామన్నారు.ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ, అక్రమంగా మద్యం రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్టులు కూడా నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఈ సంధర్బంగా తెలిపారు.

అదే విధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ స్టేషన్లో పట్టుబడినటువంటి అక్రమ మద్యం పై 207 కేసులలో పట్టు బడినటువంటి 2240 లీటర్ల కర్ణాటక మద్యం, 236 కేసుల్లో సీజ్ చేసిన 3,672 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. ఇందులో భాగంగా సేబ్ జాయింట్ డైరెక్టర్ కృష్ణ కాంత్ మాట్లాడుతూ ఈ నెలలో ఇప్పటివరకు 130 కేసులు నమోదు చేసి 141 మందిని అరెస్టు చేశామని తెలిపారు.పట్టుబడిన వారి వద్ద నుంచి 590 లీటర్ల అక్రమ నాటు సారా 1400 లీటర్ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు