హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking: చెల్లికి పిల్లలు లేరని అక్క ఏం చేసిందో చూడండి..!

Shocking: చెల్లికి పిల్లలు లేరని అక్క ఏం చేసిందో చూడండి..!

X
చెల్లికి

చెల్లికి పిల్లలు లేరని అక్క ఏం చేసిందో చూడండి..

పిల్లలు లేకపోతే ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కొందరు పూజలు చేస్తారు. గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతారు. కానీ ఓ మహిళ మాత్రం చెల్లికి పిల్లలు లేరనే బాధతో ఎవరూ చేయకూడని పని చేసింది. చివరకు కటకటాలపాలైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

పిల్లలు లేకపోతే ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కొందరు పూజలు చేస్తారు. గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతారు. కానీ ఓ మహిళ మాత్రం చెల్లికి పిల్లలు లేరనే బాధతో ఎవరూ చేయకూడని పని చేసింది. చివరకు కటకటాలపాలైంది. కర్నూలు (Kurnool) నగరంలో జరిగిన ఓ కిడ్నాప్ కేసు వెనుక కథ తెలిసి పోలీసులు షాకయ్యారు. కర్నూలు శరీన్ ‌నగర్ కు చెందిన కేదాసు లక్ష్మీ నారాయణమ్మ, ఆమె చెల్లెలు.. ఎమ్మిగనూరుకు చెందిన మునీశ్వరి, ఆమె మరిది నాగార్జునను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు శరీన్ నగర్ కు చెందిన కోతి లలితకు తన ఇద్దరు కుమారులున్నారు. అదే వీధిలో లక్ష్మీ నారాయణమ్మ నివాసం ఉంటోంది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో భర్త వదిలేయడంతో ఒంటరిగా ఉంటూ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది.

ఇదిలా ఉంటే ఎమ్మిగనూరులో ఉండే లక్ష్మీనారాయణమ్మ చెల్లెలు మునీశ్వరమ్మకు కూడా పిల్లలు కలగపోవడంతో దిగులు చెందేవారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణమ్మకు లలిత పరిచయమైంది. తన చెల్లెలికి పిల్లలు లేరని.. అందుకే నీ కుమారుల్లో ఒకర్ని దత్తత ఇవ్వాలని పలుసార్లు లలితను కోరినా ఆమె నిరాకరించింది.

ఇది చదవండి: కోడలిపై కన్నేసిన మామ.. ఇద్దరు అత్తలు అదే టైప్.. చివరికి..!

దీంతో లక్ష్మీనారాయణమ్మ, ఆమె చెల్లెలు మునీశ్వరి కలిసి.. లలిత కుమారుల్లో ఒకరిని కిడ్నాప్ చేయాలని భావించింది. అందులో భాగంగా ఉగాది రోజున కల్లూరులోని చౌడేశ్వరీ దేవి అలయం వద్ద జరిగే జాతరకు వెళ్దామంటూ లలితను, ఆమె పిల్లలను తీసుకెళ్లింది లక్ష్మీనారాయణమ్మ. అనుకున్న ప్రకారం జాతరలో తనకు దాహం అవుతోందని లక్ష్మీనారాయణమ్మ చెప్పడంతో లలిత.. ఆమె చిన్నకుమారుడనై ప్రవీణ్ ను వదిలేసి.. పెద్ద కుమారుడితో కలిసి నీళ్లు తీసుకురావడానికి వెళ్లింది. లలిత తిరిగొచ్చేసరికి ప్రవీణ్ కనిపించలేదు.

దీంతో ప్రవీణ్ ఎక్కడని లక్ష్మినారాయణమ్మను నిలదీయగా.. మీ వెనుకే వచ్చాడని చెప్పడంతో చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో లక్ష్మీనారాయణమ్మపై అనుమానంతో కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. లక్ష్మీనారాయణమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే తన చెల్లెలి కోసం కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకుంది. బాలుడ్ని తన చెల్లెలు మునీశ్వరి, ఆమె భర్త నాగార్జునకు ఇచ్చినట్లు చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మిగనూరులో బాలుడ్ని స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News