Home /News /andhra-pradesh /

KURNOOL PIGS ATTACK ON BOY IN AHOBILAM KURNOOL DISTRICT SNR

Pigs Attack: ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే అవే పెద్ద సమస్య..పిల్లాడ్ని కూడా వదల్లేదుగా

(బాలుడిపై పందులు దాడి)

(బాలుడిపై పందులు దాడి)

Pigs Attack: పవిత్రపుణ్యక్షేత్రమైన అహోబిలంలో పందులు భయపెడుతున్నాయి. ఏడేళ్ల బాలుడిపై దాడి చేయడంతో వాటిని పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పీఠాధిపతి ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కర్నూలు జిల్లా(Kurnool district)లోని ఓ పుణ్యక్షేత్రంలో పందులు బెడద స్థానికులకు దడ పుట్టిస్తోంది. ఆళ్లగడ్డ మండలం అహోబిలం(Ahobilam) లో ఓ బాలుడిపై పందులు దాడి (Pigs attack)చేశాయి. ఏడేళ్ల కార్తీక్‌ (7Year old Karthik)పై పందులు గుంపుగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పందులు దాడి చేస్తుండటం స్థానికులు చూసి వాటిని అక్కడి నుంచి తరిమివేయడంతో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాలుడ్ని వెంటనే ఆళ్లగడ్డ(Allagadda)లోని ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్తీక్‌కి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. బాలుడిపై పందులు దాడి చేసిన ఘటనపై తల్లిదండ్రులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి(Srilakminarasimhaswamy) దేవస్థానం చుట్టూ పందులు తిరగడం, ఆ పరిసర ప్రాంతాల్లోనే కొందరు పందులు పెంచుతున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రంలో ఇలా పందులు పెంచడం వల్లే స్థానికులపై దాడి చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇలా పందులు పెంచే వారిపై చర్యలు తీసుకోవాలంటూ కార్తీక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు (Police compliant) చేసేందుకు వెళ్తే వాళ్లు కంప్లైంట్ తీసుకునేందుకు నిరాకరించారు.

పుణ్యక్షేత్రంలో పందుల బెడద..
పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలా పందుల సంచారం వల్ల ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానికులకు పెద్ద సమస్యగా మారింది. దీంతో విషయాన్ని మాజీ మంత్రి అఖిలప్రియ దృష్టికి తీసుకెళ్లారు బాలుడి తల్లిదండ్రులు. అయితే ఆమె అహోబిలం పీఠాధిపతిని కలిసి పందుల దాడిలో గాయపడిన బాలుడ్ని చూపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇలా పందులు దేవస్థానం చుట్టూ తిరగడం, స్థానికులపై దాడి చేయడంపై పిఠాధిపతి విచారం వ్యక్తం చేశారు. వెంటనే అహోబిలంలో పందుల బెడద లేకుండా చూడాలని స్థానిక ఈవోని కోరారు. ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పందులు దాడిలో బాలుడికి గాయాలు..
ఏడేళ్ల బాలుడిపై పందులు దాడి చేయడం బాధకరమని చెప్పారు అఖిలప్రియ. ఎవరైతే దేవస్థానం పరిసరాల్లో పందులను పెంచుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై పందులు ఆలయ పరిసరాల్లోకి రాకుండా చూడాలని కలెక్టర్‌ని కోరారు. పందుల దాడితో బాధపడుతున్న స్థానికులక సమస్యను అధికారులే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో తామే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న ప్రదేశాల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని అధికారుల్ని కోరుతున్నారు స్థానికులు.
కర్నూలు..ఆళ్లగడ్డ
Published by:Siva Nanduri
First published:

Tags: Andhra Pradesh, Kurnool, VIRAL NEWS

తదుపరి వార్తలు