హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unique Traditions: కాలితో తంతే మీ దరిద్రం దూల తీరుపోద్ది.. కర్నూలులో తన్నుల స్వామి మాయ..

Unique Traditions: కాలితో తంతే మీ దరిద్రం దూల తీరుపోద్ది.. కర్నూలులో తన్నుల స్వామి మాయ..

కర్నూలులో తన్నుల బాబా

కర్నూలులో తన్నుల బాబా

Superstitions: ఈ బాబా కాలుతో తంతే కష్టాలే కాదు ఎలాంటి సమస్య అయినా పోతుందట. కాలితో తంతే కష్టాలు పోవడమేంటనుకుంటున్నారా..? అయితే మనం ఏపీలోని ఈ గ్రామానికి వెళ్లాల్సిందే..!

M. Bala Krishna, Hyderabad, News18

మూఢనమ్మకాలు చదువుకున్న వారిని కూడా అప్పుడుప్పుడు పిచ్చి ప‌నుల‌కు ప్రోత్సహిస్తాయి. ఎవ‌రో చ‌దువుకోని వారు బాబాల మాయ‌లో ప‌డి వెర్రి ప‌నులు చేస్తోన్నారంటే త‌ప్పులేదు కాని డిగ్రీలు చ‌దివి, గౌరవప్రదమైన ఉద్యోగులు చేస్తున్న వారు కూడా బాబాల‌ను న‌మ్మ వారి చూపు కోసం ప‌డిగాపులు కాస్తున్నారంటే దాన్ని ఖ‌చ్చితంగా వెర్రి అనొచ్చు. ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌న‌లే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని క‌ర్నూలు జిల్లాలో (Kurnool District) చోటు చేసుకుంటున్నాయి. ఓ బాబా కాళ్లతో తంతే క‌ష్టాల్ని ప‌టాపంచ‌ల‌వుతాయి అని ప్రచారం జ‌ర‌గ‌డంతో అంద‌రూ ఆ బాబాతో త‌న్నించుకోవ‌డానికి క్యూలు క‌డుతున్నారు. ఈ బాబా కాలుతో తంతే కష్టాలే కాదు ఎలాంటి సమస్య అయినా పోతుందట. కాలితో తంతే కష్టాలు పోవడమేంటనుకుంటున్నారా..? అయితే మనం ఏపీలోని ఈ గ్రామానికి వెళ్లాల్సిందే..!

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి వెల్లసిందే..! దీపావళి వెళ్ళిన మూడు రోజుల తర్వాత హుల్తిలింగేశ్వర స్వామి పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసం రెండవరోజు పెద్దహుల్తి గ్రామంలో హుల్తిలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరుతాయి. హుల్తిలింగేశ్వర ఉత్సవమూర్తి విగ్రహాన్ని మూసుకున్నా వ్యక్తి స్వామి ఆవహించి చేతిలో ఖడ్గం, విగ్రహం తలపై మోసుకుని గ్రామంలో ఊరేగింపుగా గుడి దగ్గరకి వస్తారు. స్వామి ఊరేగింపుగా అక్కడికి రాగానే అప్పటికే స్వామి భక్తులు తమ కష్టాలను తీర్చుకునేందుకు కొరకై వరుస క్రమంలో బోర్ల పండుకొని ఉంటారు భక్తులు.

ఇది చదవండి: సిరులు కురిపిస్తున్న అరకు కాఫీ... గిరి రైతుల పంట పండినట్లే...ఉద్యోగం రాని వారు ,సంతానం లేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అప్పులు ఉన్నవారు, ఇలా ఒక్కటి కాదు సమస్యలు ఉన్నవారు బోర్ల పడుకుంటారు. హుల్తిలింగేశ్వర స్వామి అవహించిన వ్యక్తి వారిని కాలుతో తన్ని భక్తుల సమస్యను విని పూలు, బండారు భక్తులకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు స్వామి. కాలుతో తాన్నిన తరువాత వారి కష్టాలు సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం, ఇలా అన్ని సమస్యలు పరిష్కరం అవ్వుతాయని భక్తుల నమ్మకం.


ఇది చదవండి: ఇక్కడున్నది చీరలు,నగలు అనుకుంటే మీ పొరబాటే..! సరిగ్గాచూస్తే షాక్ అవుతారు..

ఈ వింత ఆచారం చూడడానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ కంప్యూటర్ యూగం లో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు జరుగుతుండటం విశేషం. అయితే ఇక్కడ కేవలం నిరక్షరాస్యత లేని వాళ్లు మాత్రమే ఈ బోర్ల పండుకుని తన్నించుకుంటున్నారు అనుకుంటే పొరపాటు చదువు కున్న వారు కూడా ఉద్యోగం కోసం ఇలా కాలుతో తన్నించుకుంటుండడం విశేషం.

First published:

Tags: Andhra Pradesh, Kurnool

ఉత్తమ కథలు