హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Scorpion Festival: అక్కడ తేలు కుడితే అదృష్టం... ఇదెక్కడి వింత ఆచారం..?

Scorpion Festival: అక్కడ తేలు కుడితే అదృష్టం... ఇదెక్కడి వింత ఆచారం..?

కోడుమూరులో తేళ్లపండుగ

కోడుమూరులో తేళ్లపండుగ

Kurnool: తేళ్లతో ఆడుకొనే వారిని మీరు ఎప్పుడైనా చూసారా..? అసలు తేళ్లు వారికీ ఎలాంటి హాని చేయవంటే మీరు నమ్మగలరా..? మీరు విన్నది నిజం.

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

సహజంగా ఇంటిలో ఉండే చిన్న చిన్న కీటకాలను చూసి ఆడవాళ్లు పెద్దగా కేకలు వేస్తారు. మరి ముఖ్యంగా బల్లులు, బొద్దింకలను చూసి పరుగులు తీస్తుంటారు. ఇక పాములు, జెర్రులు,తేళ్ల కనిపిస్తే ప్రాణం పోయినంత పనైందని ఫీలవుతుంటారు. ముఖ్యంగా తేళ్లను చూస్తే ఆమడ దూరం పారిపోతారు. అది కుడితే వచ్చే నొప్పి మాములుగా ఉండదు. దాని విషం ద్వారా ఒక్కో సారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. తేళ్లతో ఆడుకొనే వారిని మీరు ఎప్పుడైనా చూసారా..? అసలు తేళ్లు వారికీ ఎలాంటి హాని చేయవంటే మీరు నమ్మగలరా..? మీరు విన్నది నిజం. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరులో తేళ్ళ కోసం ఏకంగా పండగ జరుపుతున్నారు. కుట్టికుట్టి బాధపెట్టే తేళ్లతో పండుగ ఎలా జరుపుకుంటారని ఆలోచిస్తున్నారా..? ఒక్కో ప్రాంతంలో ఉన్న వింత ఆచారాలు తెలిస్తే మనం నోరెళ్ళబెట్టక తప్పదు. వారి ఆచార వ్యవహారాలు ఆధునిక కాలానికి భిన్నంగా ఉంటాయి.

అంతరిక్ష పరిశోధనలో మానవులు ముందుఉన్నా కూడా... కొన్ని మూఢనమ్మకాలను ఇంకా వీడలేదు. దేవునికి పూజలు చేయడంలో ఎలాంటి తప్పు లేకపోయినా... ఓ నోరులేని జీవిని మాత్రం మూఢనమ్మకాల పేరుతో వాటిని హింసించడం మాత్రం ముమ్మాటికీ తప్పే. ఇలాంటి మూఢనమ్మకాలను ఆదివాసీలే కాదు.. మైదాన ప్రాంతాల వారు కూడా ఆచరిస్తున్నారు. సాధారణంగా తేలు కనిపిస్తే దానిని కొట్టి చంపేస్తారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. వాటిని చేతితో పట్టుకుని దేవునికి హారంగా వేసి పూజిస్తారు. ఒకవేళ కుట్టినా గుడిచుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నొప్పి వుండదంటారు. ఇది దేవుని మహిమ అని కొందరంటే కాదు మూఢ నమ్మకమని మరి కొందరంటారు.


ఇది చదవండి: బంగాళాఖాతంలో భూకంపం.. ఏపీలో ప్రకంపనలు.. సునామీ ముంచుకొస్తోందా..?

కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై వెలసిన కొండలరాయుడి ఆలయంలో తేలుని దేవుడిలా పూజిస్తారు. కొండలరాయుడి స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు. ప్రతి ఏడాది శ్రావణమాసం మూడవ సోమవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. కొండపై ఏ రాయిని కదిపినా తేలు ప్రత్యక్షమవుతుంది. కొండపై చేరుకున్న భక్తులు మొదట తేళ్లవేట కొనసాగిస్తారు. తేలు దొరికితే చాలు అదృష్టంగా భావిస్తారు. దానికి దారం కట్టి స్వామికి హారంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వలన తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్మకంగా చెపుతారు. కొండపై స్వామి మహిమ వల్ల పట్టుకున్నా తేళ్లు హాని చేయవని ఒకవేళ కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నొప్పి వుండదని అంటారు. మహిళలు చిన్నారులు వీటిని పట్టుకొని చేతిపై శరీరంపై వేసుకుంటూ విచిత్ర విన్యాసాలు చేసినా ఇవి ఎటువంటి హాని చేయకపోవడం విశేషంగా చెబుతారు. ఇది స్వామి మహిమగా భక్తులు భావిస్తుఃడగా మరికొందరు మాత్రం మూఢనమ్మకమని అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool