Home /News /andhra-pradesh /

KURNOOL PAWAN KALYAN QUESTIONED TO ANDHRA PRADESH GOVERNMENT WHY NOT CANCELED 10TH INTER EXAMS NGS

Andhra Pradesh: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం మూర్ఖత్వమే అన్న పవన్

పది, ఇంటర పరీక్షలు రద్దు చేయాలని పవన్ డిమాండ్

పది, ఇంటర పరీక్షలు రద్దు చేయాలని పవన్ డిమాండ్

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వాహణపై దుమారం ఆగడం లేదు. ప్రభుత్వం మాత్రం పది, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేస్తోంది. విపక్ష నేతలు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పది పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
    ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుంచి  తొమ్మిదో తరగతి వరకు స్కూళ్లను రద్దు చేశారు. అయితే విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది ఉండకూడదనే భావనతో పది, ఇంటర్ పరీక్షలను యాథావిధిగా నిర్వహిస్తామని మంత్రి ఆమూలపు సురేష్ ప్రకించారు. అయితే దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలతో పాటు పలు పరీక్షలను రద్దు చేసింది కేంద్రం. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అదే బాటలో నడిచి పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి తరువాత క్లాస్ లకు ప్రమోట్ చేశారు. కానీ ఏపీలో మాత్రం అలా చేయకపోవడంపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. పరీక్షలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. కానీ ప్రభుత్వం ఆ విషయంలో నిర్ణయం మార్చుకోలేదు.

    తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కరోనా ఉదృతి సమయంలో టెన్త్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ మూర్ఖత్వమే అవుతుందన్నారు. లక్షల మంది విద్యార్థులు, కుటుంబాలను కరోనా ముప్పులోకి నెడుతున్నారని అన్నారు. టెన్త్ పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

    కరోనా సెకెండ్ వేవ్ చాలా ప్రమాదకారమని తెలిసినా ఏపీ సర్కార్ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామనడం మూర్ఖత్వానికి అద్దం పడుతోందని పవన్ ఆరోపించారు. గత మూడు రోజులగా కరోనాతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి ప్రభుత్వమే నెట్టేస్తుందా అంటూ మండిపడ్డారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని.. మరి ఒక్క ఏపీ ప్రభుత్వానికే ఈ పట్టుదల ఎందుకు అన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

    రెండు రోజుల కిందట ఇదే విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కోరారు. కానీ కరోనా తీవ్రత వల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందాన వ్యవహరిస్తోందని విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారన్న సంగతి గుర్తు చేస్తున్నారు. అదే విధంగా అనేక జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, వాటి హాస్టళ్లలో ఉన్నవారు ఈ వైరస్ సోకి ఇబ్బందులుపడుతున్నారు. ఇలాంటి సమయంలో పరీక్షల నిర్వహణ అంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Schools, Corona bulletin, Corona cases, Corona virus, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు