Murali Krishna, News18, Kurnool
కన్నబిడ్డలకు అన్నీ తామే అయి చూస్తుంటారు తల్లిదండ్రులు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు.. తమ జీవితాలనో దారపోస్తుంటారు. చివరికి ఏమీలేక రోడ్డున పడుతుంటారు. అలాంటి దంపతుల కథే ఈ వార్త. ఉన్న గూడును మరిన్ని ఆస్తులను అమ్మి.. తద్వారా వచ్చిన డబ్బుతో బిడ్డలకు వివాహంజరిపించారు ఆ వృద్ధదంపతులు. గత మూడేళ్లుగా ఉండటానికి ఇల్లు కూడా లేకపోవటంతో... వారికీ బస్టాండే బాసటగా నిలిచింది. కనికరించే వారులేక ఉండడానికి గూడు లేకఊరిలో ఉన్నటువంటి బస్టాండ్‌లోనే తలదాచుకుని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తూన్నారు హోటల్ సుభాన్, హుస్సేబీదంపతులు..ఈ ఘటన కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలో జరిగింది.
ఎలాంటి ఆధారం లేని వారు
కటిక పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబంపై అధికారులు మాత్రం కాసింత జాలిచూపి గూడు కల్పించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్ వదిలిపెడితే రోడ్డున పడాల్సిందేనని కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. స్థానికుల వివరాల మేరకు.. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన హోటల్ సుభాన్, హుస్సేన్‌బీ వృద్ధ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరికి ప్రస్తుతం ఎలాంటి ఆస్తుల్లేవు.
గోనెగండ్లలో నివాసముంటున్నారు. ఇటీవల సుభాన్ అనార్యోగంతో కాళ్లు, చెయ్యి పడిపోయి మంచానపట్టాడు. భార్య హుసేన్ బీ ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తో పాటు గ్రామంలోని ఓ కాలనీలో చిన్నపాటి టీ కొట్టు నిర్వహించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెల వివాహం, మరియు సొంత ఖర్చులకు భర్త సుభాన్ చేసిన అప్పు లు భారంగా మారాయి. దీంతో ఇంటిని స్థలాన్ని అమ్మేసి అప్పులు తీర్చారు. ప్రస్తుతం ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఇంటి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
కానీ అధికారులు మాత్రం వారికీ ఎలాంటి స్థలాన్నిమంజూరు చేయకపోవడంతో ఊరిలోనిబస్టాండు కోసం ఏర్పాటు చేసిన షెడ్కే పరిమితమయ్యారు. గ్రామానికి వచ్చిన నాయకులు, అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా కసింతైనా కనికరించడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమౌతున్నారు. ఇంటికోసం వారు తిరగని ఆఫీస్ కానీ మోరపెట్టుకొనటువంటి అధికారి లేడు. ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి వీరికి సహాయ సహకారాలు అందించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News