Andhra Pradesh: క్యాష్ ఉంటేనే కరోనాకు వైద్యం. కార్డుల్లో బ్యాలెన్స్ ఉన్నా కుదరదు? ఇన్స్యూరెన్స్ ఉంటే చేర్చుకోరు? కారణం ఏంటో తెలుసా?

క్యాష్ ఉంటేనే కరోనాకు వైద్యం

ప్రైవేటు ఆస్పత్రుల కాసుల కక్కుర్తి మనుషల ప్రాణాలను తీసేస్తోంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా.. కార్డులు పని చేస్తున్నాయన్నా. బీమాలు, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా.. ఆస్పత్రులు వైద్యం చేసేందుకు నో అంటున్నాయి. ఓన్నీ క్యాష్ ఇస్తేనే చికిత్స అంటూ రోగులకు కండిషన్లు పెడుతున్నాయి. అందుకు కారణం ఏంటో తెలుసా?

  • Share this:
    కరోనా కష్ట సమయంలో అండగా ఉండాల్సిన ఆస్పత్రులు.. కాసుల కక్కురితో మనుషుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల రక్తన్ని జలగల్లా పీల్చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యు సదుపాయాలు లేక.. సరిపడ బెడ్స్ లేక పొరపాటున ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే అంతే సంగతులు.. కాసులు కుమ్మరించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ ఉన్నా? ప్రైవేటు ఇన్స్యూరెన్స్ చేయించుకున్నా? ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ఉన్నా చికిత్సకు నో చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలం సృష్టిస్తుండటం, ఆక్సిజన్‌ బెడ్ల అవసరం పెరగడంతో కాస్త మంచి చికిత్స లభిస్తుందని భావించే ఆస్పత్రులకు డిమాండ్‌ పెరిగింది. పనిలోపనిగా కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులుగా మారినవి, మొదటి నుంచీ మంచి పేరున్న కార్పొరేట్‌ ఆస్పత్రులన్నీ ఈ పరిస్థితిని బాగా క్యాష్‌ చేసుకుంటున్నాయి. నగదు చెల్లిస్తేనే పడక ఇస్తామని మొహం మీద చెప్పేస్తున్నాయి.

    కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన రాష్ట్రం మనదే చాలాసార్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంటోంది. కానీ.. క్షేత్రస్థాయిలోకి వెళితే.. అత్యధిక ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని పట్టించుకోవడంలేదు. ఆరోగ్య శ్రీకార్డు ఉందని చెబితే చాలు.. ఆస్పత్రిలో బెడ్స్ లేవని నేరుగా వెనక్కు పంపించేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులు మాత్రమే నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీకి పడకలు కేటాయిస్తున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు మాత్రం రికార్డుల్లో ఖాళీ అని చూపిస్తూ, రోగుల టెన్షన్ ను క్యాష్ చేసుకుంటున్నాయి.

    ఈహెచ్‌ఎస్‌ పరిస్థితి కూడా అంతే. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆస్పత్రులు లైట్ తీసుకుంటున్నాయి. ఈహెచ్‌ఎస్‌ కింద ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మాత్రమే బిల్లులు వేయాల్సి ఉంటుంది. అంటే సాధరణంగా కొవిడ్‌ బారినపడి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న వారికి అందించే చికిత్సకు రోజుకు 3500 మించకుండా బిల్లు వేయాలి. చాలా ఆస్పత్రులు 15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. అందుకే ఈహెచ్ఎస్ ను అమోదించడం లేదు.

    ప్రైవేటు హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ల కథ కొంచెం భిన్నమైంది. సాధారణంగా ఈ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ఉన్న వారికి చికిత్సలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆస్పత్రులు కూడా వీరికి మంచి ప్రాధాన్యం ఇస్తాయి. కొవిడ్‌ చికిత్స విషయంలో మాత్రం ఇది వర్తించడంలేదు. ఇక్కడ కూడా కొన్ని రూల్స్ అడ్డొస్తున్నాయి. ప్రైవేటు బీమా కంపెనీలు కూడా కొన్ని పరిమితుల మేరకు బిల్లులను చెల్లిస్తాయి. చికిత్స పేరిట లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీలకు... హెల్త్‌ కార్డులను కూడా పట్టించుకోవడంలేదు. అతి తక్కువ ఆస్పత్రులు మాత్రం... కొన్ని ప్రత్యేకమైన సంస్థల బీమాలను మాత్రమే ఆమోదిస్తున్నాయి. పెద్దస్థాయిలో సిఫారసులు చేయించుకుంటే... అది కూడా, పాలసీ ఎన్ని లక్షలకు ఉందో చూసి మాత్రమే పేషంట్‌ను చేర్చుకుంటున్నాయి.

    ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సహా బీమాలేవీ ప్రైవేటీ ఆస్పత్రులు ఆమోదించకపోవడంతో ఎక్కువ శాతం మంది రోగులు ప్రాణాలు నిలుపుకొనేందుకు ఆస్తులు అమ్ముకుని, అప్పులు తెచ్చి మరీ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. చాలావరకు ఆస్పత్రులు వాటి స్థాయిని బట్టి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్‌ కట్టిన తర్వాతే బెడ్‌ కేటాయిస్తున్నాయి. ఆక్సిజన్‌ అవసరం, రెమ్‌డెసివర్‌, వెంటిలేటర్‌.. ఇలా చికిత్స స్థాయిని బట్టి ఖర్చు పెరుగుతూ పోతుంది.

    చాలావరకు ఆస్పత్రులు క్రెడిట్‌ కార్డులను కూడా ఆమోదించడంలేదు. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌, డెబిట్‌ కార్డ్‌ స్వైపింగ్‌ ను కూడా అనుమతించడం లేదు. అందుకే కారణాలు చాలానే ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ఓన్లీ క్యాష్ అనడానికి అసలైన కారణాలు ఏంటంటే. రోగుల దగ్గర నుంచి ఇన్స్యూరెన్స్‌ కార్డులు తీసుకున్నా, ఆరోగ్యశ్రీ కార్డులో చికిత్స చేసినా బిల్లులో ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి. చివరికి ఏటీఎం, క్రెడిట్‌ కార్డు ద్వారా రోగుల దగ్గర నుంచి వసూళ్లు చేస్తే... అది అధికారికంగా లెక్కల్లో చూపించాల్సిందే. పైగా... ట్రాన్సాక్షన్‌ లావాదేవీ వినియోగదారుడి దగ్గర కూడా రికార్డు అవుతుంది. ఇదంతా జరిగితే... భారీ దోపిడీకి వీలుండదు. క్యాష్‌తో ఇలాంటి సమస్యలేవీ ఉండవు. బిల్లు కూడా ఇవ్వాల్సిన పని లేదు. ప్రైవేటు హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ఉన్న వారు పదేపదే అడిగితే... రూ.లక్షన్నర వరకు రసీదులు ఇచ్చి, రీఇంబర్స్‌ చేసుకోమని చెబుతున్నాయి.

    ఇదీచదవండి: ఐసోలేషన్ వార్డుగా రామానాయుడు స్టూడియో. ఎవరికి కేటాయిస్తున్నారో తెలుసా?

    విశాఖపట్నం విషయానికి వస్తే దాదాపు 61 ఆస్పత్రులున్నాయి. వీటిలో వేళ్లపై లెక్కపెట్టే ఆస్పత్రులు మాత్రమే బీమాకు అనుమతిస్తున్నాయి. కరోనా బాధితులు రిసెప్షన్‌ వద్దకు రాగానే... ఒక పద్ధతి ప్రకారం వారు క్యాష్‌ కడతారా, కార్డులు ఉన్నాయా అని ఆరా తీస్తారు. కార్డులు, ఆరోగ్యశ్రీ’ పేరు చెబితే.. అయ్యో... తమ వద్ద పడకలు లేవని.. మరో ఆస్పత్రికి వెళ్లండి అని వెనక్కు పంపించేస్తున్నారు. దీంతో ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు. క్యాష్‌ ఇస్తాం. బెడ్‌ ఇవ్వండి అని ప్రాధేయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

    ఇదీచదవండి: అమానుషం క్యాష్ కట్టలేదని ప్రాణం తీశారు?.. మరీ ఇంత కాసుల కక్కుర్తా?

    ఇటీవల విజిలెన్స్ తనిఖీల్లో ఇలాంటి భాగోతాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు అడ్వాన్సు తీసుకోకూడదు. తాజాగా జరిపిన విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడిన కేసుల్లో సగం అడ్వాన్సుకు సంబంధించినవే. ఈ తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. కర్నూలులో ఇటీవల ఒక చిన్న ఆసుపత్రిలో మాత్రమే తనిఖీలు చేశారు. పెద్ద పెద్ద ఆసుపత్రులను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కొవిడ్‌ చికిత్సపై కర్నూలులో సమీక్ష నిర్వహించారు. తనకు తెలిసిన కొవిడ్‌ బాధితుడికి ఓ ప్రైవేటు ఆసుపత్రి 25 లక్షలు బిల్లు వేశారని, రసీదులు కూడా ఇవ్వలేదని మేయర్‌ బీవై రామయ్య ఫిర్యాదు చేశారు.
    Published by:Nagesh Paina
    First published: