Home /News /andhra-pradesh /

KURNOOL OFFICIALS HIKES SEVA TICKET PRICE IN SRISAILAM TEMPLE FULL DETAILS HERE PRN KNL NJ

సామాన్య భక్తులకు భారీ షాక్..! ఇకపై శ్రీశైలంలో ఆర్జిత సేవలకు రెట్టింపు ధర.. వివరాలివే..!

శ్రీశైలం ఆలయంలో టికెట్ ధరల పెంపు

శ్రీశైలం ఆలయంలో టికెట్ ధరల పెంపు

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే ఇకపై సామాన్యుడు జేబుకు చిల్లుపడేలా ఉంది. ఆర్జిత సేవల ధరలను భారీగా పెంచేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    Murali Krishna, News18, Kurnool అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే ఇకపై సామాన్యుడు జేబుకు చిల్లుపడేలా ఉంది. ఆర్జిత సేవల ధరలను భారీగా పెంచేశారు. ఆలయంలో 14 రకాల సేవల్లో భక్తులు పాల్గొనేందుకు వీలు కల్పించినా... ఉదయాస్తమాన సేవ ధరను భారీగా పెంచేశారు. ఉదయాస్తమాన సేవలో పాల్గొనాలంటే భక్తులు ఇకపై అక్షరాలా రూ.1,01,116 చెలించాల్సి ఉంటుంది. అదే విదంగా ప్రదోషాకాల సేవకు రూ.25,116 చెల్లించి రుసుము తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో సర్వసేవ పథకంతో పూజలు చేయించుకునే వారికి రూ.5000 టికెట్ ధర ఉండేది. ఇప్పుడు అది కాస్త ఏకంగా 2 రేట్లు ఎక్కువగా పెరగడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రదోషకాల సేవ… ఇందులో సాయంత్రం మంగళ హారతి గర్భలయంలో పంచామృతాభిషేకం, అమ్మవారి గర్భగుడిలో కుంకుమార్చన సేవ, అనంతరం వేద పండితుల ఆశీర్వచనం, వంటి ఆరు సేవా కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఆరు నెలల ముందుగానే బుకింగ్స్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

    ఇది చదవండి: హస్తకళలకు పెరుగుతున్న ఆదరణ: నేరుగా అమ్మకాలతో కళాకారులకు లాభం

    ఒకవేళ ఏ రోజైనా ఖాళీ స్లాట్ ఉన్నపుడు దాన్ని భర్తీ చేసేందుకు వీలుగా కరెంట్ బుక్కింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కరెంటు బుకింగ్ చేసుకోవాలంటే కాస్త ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిన మహా మంగళ హారతి, సుప్రభాత సేవ, కార్యక్రమాలను కొత్తగా తీసుకొచ్చినటు వంటి ప్రదోషకాల సేవ, ఉదయాస్తమాన సేవల్లో భాగంగా వీటిని చేర్చారు.

    ఇది చదవండి: ఈ యుద్ధకళ నేర్చుకుంటే.. ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం..! మీరు ట్రై చేయండి..!

    శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుగనున్నాయి. ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజలు చేసి పురవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఆలయం వెలుపల భక్తులు ఉత్సవాలను తిలకించేందుకు వీలుగా ఎల్‌ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయా ఈఓ లవన్న ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులకు దేవస్థానం నిర్దేశించిన సమయాల్లోనే దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో చెప్పారు. సామాన్య భక్తులకు మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. ప్రముఖులకు ముందుస్తు దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చెప్పారు. అదే విధంగా అక్టోబరు 4న రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆన్‌లైన్ దర్శనం కోసం ఈ www.srisiladevastanam. Org వెబ్‌సైట్‌నందు బుకింగ్‌ చేసుకోవచ్చు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Local News, Srisailam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు