హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: పేరుకే సదరమ్ క్యాంప్‌లంటూ హడావిడి... ప్రజలకు ఒరిగిందేమీ లేదు..? స్పందనలో బాధితుల గోడు..!

Kurnool: పేరుకే సదరమ్ క్యాంప్‌లంటూ హడావిడి... ప్రజలకు ఒరిగిందేమీ లేదు..? స్పందనలో బాధితుల గోడు..!

కర్నూలులో జారీకాని సదరమ్ సర్టిఫికెట్లు

కర్నూలులో జారీకాని సదరమ్ సర్టిఫికెట్లు

Kurnool: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కొన్ని.. అందులో అంగవైకల్యంతో జీవన పోరాటం మరొకరిది. ఆకలి తీరాలన్నా.. వైద్యం చేయించుకోవాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. జీవనం కష్టమై దివ్యాంగుల పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే.. అధికారుల నుంచి స్పందన కరవైందని వారు వాపోతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కొన్ని.. అందులో అంగవైకల్యంతో జీవన పోరాటం మరొకరిది. ఆకలి తీరాలన్నా.. వైద్యం చేయించుకోవాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. జీవనం కష్టమై దివ్యాంగుల పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే.. అధికారుల నుంచి స్పందన కరవైందని వారు వాపోతున్నారు. మరికొందరు తమ భూమిని తీసుకున్నా.. ఇంతవరకు పరిహారం ఇవ్వలేదంటూ ప్రతివారం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. కర్నూలు జిల్లా (Kurnool District) లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందనకు కుప్పలు తెప్పలుగా ప్రజల నుంచి అర్జీలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ స్పందనలో అర్జీలు పెట్టుకుంటున్నారు.

  నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన 12 ఏళ్ల మహ్మద్‌ గౌస్‌ మానసిక, శారీరక దివ్యాంగుడు. నడవలేడు, మాట్లాడలేడు. తండ్రి యూసుఫ్‌ కూలి పనిచేస్తుండగా తల్లి చాందిని ఇంటి పట్టునే ఉంటూ గౌస్‌ ఆలనాపాలన చూస్తున్నారు. ముగ్గురు సంతానంలో కూతురు మాత్రమే పాఠశాలకు వెళుతుంది. మరో కుమారుడు క్యాన్సర్‌ బారినపడ్డాడు.

  ఇది చదవండి: మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌..! వెయ్యి నుంచి రూ.25 వేలు పొందే అవకాశం..! త్వరపడండి..!

  దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పిల్లలకు వైద్యం చేయించేందుకు హాస్పటల్‌కి తీసుకెళ్ళాలన్నా యూసుఫ్ చేసే కూలీ పనికి వచ్చే చాలీ చాలని డబ్బుతో రవాణాకే సరిపోయే పరిస్థితి. గౌస్‌కు 90 శాతం వైకల్యం ఉందని మూడేళ్ల క్రితం ధ్రువీకరణ పత్రం ఇచ్చినా పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకు మంజూరు కాలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబానికి న్యాయం చేయాలని గౌస్‌ తల్లి చాందిని అధికారులను వేడుకుంటున్నా న్యాయం మాత్రం జరుగడం లేదు.

  ఇది చదవండి: ఐటీఐ విద్యార్థులకు శుభవార్త.., ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి.. వివరాలివే..!

  రాజేంద్రబాబు, మార్తమ్మ. వీరిది బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామం. వీరి కుమార్తె శ్రావణి (12). ఈమెకు మాటలు రావు. పుట్టుకతోనే సమస్యలు ఏర్పడ్డాయి. 2017 ఆగస్టులో ఈ అమ్మాయి పేరుతో సదరమ్‌ ఐడీ నంబరు 13186330090112085తో ఐదేళ్ల కాలపరిమితితో 90 శాతం వైకల్యం ఉన్నట్లు వచ్చింది. ఏడాదిన్నర కిందట వరకు వీరికి సదరమ్‌ ఐడీ వచ్చిందన్న విషయం తెలియదు. తెలిసినప్పటి నుంచి వికలాంగుల పింఛనుకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాలేదు. తీరా సదరమ్‌ కాలపరిమితి గత నెలతో ముగిసింది.

  ఇది చదవండి: అర్గానిక్ ఫార్మింగ్‌లో కొత్తపుంతలు..! ఔరా అనిపిస్తోన్న ప్రకృతి వ్యవసాయసాదురుడు..!

  తమ కుమార్తెకు వికలాంగుల పింఛను ఇవ్వాలంటూ తల్లిదండ్రులు అటు నంద్యాల, ఇటు కర్నూలు జిల్లాల్లో జరిగే స్పందన కార్యక్రమానికి, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకుల చుట్టూ తిరుగుతున్నా పాత ఐడీ తొలగించడం లేదు.. కొత్తగా సదరమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం లేదని కుమార్తె తండ్రి రాజేంద్రబాబు కన్నీరుమున్నీరవుతున్నారు. స్పందన కార్యక్రమంలో తమ గోడు వెల్లబోసుకుంటే న్యాయం జరుగుతుందని వస్తున్నామని… ఇక్కడ కూడా తమను పట్టించుకునే నాథుడు కనిపించడం లేదంటూ బాధితులు వాపోతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు