హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నేటికీ బస్సులు వెళ్లని ఊళ్లున్నాయంటే నమ్ముతారా..? ఇదిగో మీరే చూడండి..

నేటికీ బస్సులు వెళ్లని ఊళ్లున్నాయంటే నమ్ముతారా..? ఇదిగో మీరే చూడండి..

కర్నూలు

కర్నూలు జిల్లాలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు

ఇటీవల ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లో పలు అంశాలపై చర్చ జరగింది. ప్రజలకు మేం అంత చేశాం ఇంత చేశాం అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేవంటే నమ్ముతారా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  ఇటీవల ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లో పలు అంశాలపై చర్చ జరగింది. ప్రజలకు మేం అంత చేశాం ఇంత చేశాం అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేవంటే నమ్ముతారా..? ఆ గ్రామాలు కూడా ఏ కొండలపైనో లేవు. మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. కర్నూలు జిల్లా (Kurnool District) కోడుమూరు నియోజకవర్గం పరిధిలో దాదాపుగా 10 గ్రామాలకు రవాణా సౌకర్యం లేదు. నిర్జూరు, జి. సింగవరం, ఎదురురూ, ఆర్. కొంతలపాడు వంటి గ్రామాల పరిస్థితి అయితే మరింత దయానీయంగా మారింది. రోడ్డు సౌకర్యం సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ గ్రామాలకు కనీసం ఆర్‌టిసి బస్సులు కూడా వెళ్లవంటే నమ్ముతారా..?

  ఈ గ్రామాల ప్రజలు నేటికి ఆటోలపై ఆధారపడి పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. వర్షా కాలంలో రోడ్లన్నీ జలమయమై బురద గుంతల్లా మారుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కర్నూలుకు కూత వేటు దూరంలోనే ఉన్న ఈ గ్రామాలకి కనీసం మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేవు. అత్యవసర సమయాలలో పట్టణానికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలుకు చేరుకోవడానికి నరకయాతన అనుభవించాల్సి వస్తుందంటూ గ్రామస్తులు వాపోతున్నారు.

  ఇది చదవండి: ఉప ముఖ్యమంత్రి ఇలాఖాలో గిరిజనుల కష్టాలు..! నేటికీ అటువైపు కన్నెత్తి చూడని ప్రభుత్వం..!

  ఈ మధ్యకాలంలోనే ఓ నిండు గర్భిణి ఈ రోడ్డులో ప్రయాణిస్తూ తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణం మీదకు వచ్చినా అధికారులలో మాత్రం చలనం రాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత ఐదేళ్లుగా అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. కానీ పరిష్కారం మాత్రం కావడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో పాలకులు అభివృద్ధిని విస్మరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 4 సంవత్సరాలు గా రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉన్నా నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రం తొంగి చూడడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

  గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వచ్చిన కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ బాబు ఇక్కడి రోడ్ల పరిస్థితి చూసి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినా.., నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామాల వైపు వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు కేవలం హామీలకే పరిమితం చేస్తున్నారు అని సమస్య మాత్రం తీరడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు