హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: వైసీపీ ఎమ్మెల్యే భర్త హత్య కేసులో ట్విస్ట్.. కులసంఘాల ఎంట్రీతో హైడ్రామా..!

Kurnool: వైసీపీ ఎమ్మెల్యే భర్త హత్య కేసులో ట్విస్ట్.. కులసంఘాల ఎంట్రీతో హైడ్రామా..!

X
వైసీపీ

వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో ట్విస్ట్

కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి (MLA Sridevi) భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో హైడ్రామా నెలకొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి (MLA Sridevi) భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో హైడ్రామా నెలకొంది. నారాయణ రెడ్డి 2017 మే 21న ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఏ1 ముద్దాయిగా కురువ రామాంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. బెయిల్ పై బయటికి వచ్చిన ముద్దాయిని పోలీసులు పెద్దలు గ్రామంలో ఉండడానికి నిరాకరించడంతో వేరే ప్రాంతంలో తలదాచుకుని జీవనం సాగిస్తుండేవారు. గత కొంత కాలంగా ఓర్వకల్ మండలంలోని హుషానాపురంలో ఉంటున్న రామాంజనేయులుపై కృష్ణగిరి పోలిస్టేషన్లో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆర్ధికంగా చితికిపోయి ఉన్నామని.. తమ ఊరిలో ఉన్న సొంతపొలాలు సాగుచేసుకుంటాము అని రామాంజనేయులు మానవహక్కుల కమిషన్ ను అభ్యర్థించారు.

కల్లూరు మండలంలో తన అల్లుడు సురేంద్ర ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి వెళ్లిన రామాంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తంప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో రామాంజనేయులు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

ఇది చదవండి: వీళ్లంతా డేంజర్ గాళ్లే.. ఏం చేసి జైలు కొచ్చారో తెలిస్తే.. షాక్ అవుతారు..

దీంతో అతని కుటుంబసభ్యులు కురవసంఘంనాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.గ్రామానికి చెందిన కురువ రామాంజనేయులపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ కేసును వెంటనే ఎత్తివేయాలని కురువ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఒత్తిళ్ల మేరకు పోలీసులు కురువ రామాంజనేయులపై వేధింపులను గురిచేస్తూ అక్రమంగా కేసుల్లో ఇరికించారని వారు ఆరోపించారు.

ఇదీ చదవండి : యమలోకానికి షార్ట్ కట్స్ ఇవే..! డేంజర్ అని తెలిసినా.. అధికారులకు పట్దదా..?

వైకాపా నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో రామాంజనేయులు నిందితుడుగా ఉన్నారు. రామాంజనేయులు సొంత గ్రామం చెరుకుల పాడు గ్రామాన్ని వదిలి వేరే ఊరులో జీవనం సాగిస్తున్న పోలీసులు అక్రమ ఇసుక, అక్రమ నాటు సారా కేసుల్లో ఇరికించి పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారని రామాంజనేయులు భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై కేసులు ఎత్తివేయకుంటే పోలీసులు ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానని ఆమె హెచ్చరించారు. రామాంజనేయులుపై పెట్టిన కేసును ఎత్తు వేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కురువ సంఘాల నాయకులు ఆందోళన చేపడుతు హెచ్చరించారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు