హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balakrishna: ఫ్యాక్షన్ అడ్డాలో బాలయ్య సందడి.. శరవేగంగా NBK107 షూటింగ్.. ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

Balakrishna: ఫ్యాక్షన్ అడ్డాలో బాలయ్య సందడి.. శరవేగంగా NBK107 షూటింగ్.. ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

కర్నూలులో బాలయ్య సందడి

కర్నూలులో బాలయ్య సందడి

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కర్నూలులో సందడి చేస్తున్నారు. ఓర్వకల్లు, పంచలింగాల, పూడిచర్ల ప్రాంతాల్లో షూటింగ్ కోసం బాలయ్య వచ్చారు. ఆయన్ను చూసేందుకు నందమూరి అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం కర్నూలు (Kurnool) లో సందడి చేస్తున్నారు. ఎందుకంటే..? మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) క్రేజీ కాంబినేషన్ లో బాలకృష్ణ కథానాయకుడిగా సినిమా చేస్తున్నారు. బాలయ్య 107వ (NBK107) చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తేలిపోయింది. బాలయ్య భిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా `అఖండ` (Akhanda) స్థాయిని అంతకంతకు పెంచేలా చిత్రం ఉంటుందని అభిమానులు ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కొద్ది రోజులుగా కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. అలంపూర్.. యాగంటి.. కొమ్మ చెరువు ప్రాంతం పూడిచర్ల.. ఓర్వకల్లు.. పంచలింగాల.. మరిన్ని ప్రదేశాల్లో బాలయ్య సహా ప్రధాన తారాగణంపై కీలక ససన్నివేశాలు చిత్రీకరించారు. NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

నేడు కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా అక్కడకి వచ్చిన బాలయ్యను చూసేందుకు.. అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఆయన కూడా ఏ మాత్రం విసుక్కో కుండా తనతో పాటు అభిమానులకు కలిసి ఫోటోలు దిగే అవకాశం ఇచ్చారు. బాలయ్య ఛాన్స్ ఇవ్వడంతో చాలామంద సెల్ఫీలు దిగారు. స్థానిక నాయకులు.. టీడీపీ ప్రముఖులు సైతం బాలయ్యను కలిశారు.

NBK107 || Nandamuri Balakrishna in Kurnool for shooting || కర్నూల్లో బాల... https://t.co/QRKfZg5jXR via @YouTube #Balakrishna #Balayya #NBK107 #NBK #NBK108 #nbk70winners

అంతకు ముందు బాలయ్య కర్నూలు రాక తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున బ్యానర్లు ఏర్పాటుతో పండగ వాతావరణమే నెలకొంది. ప్రస్తుతం ఎన్బీకే 107 షూటింగ్ కర్నూలు సిటీకి షిప్ట్ అయింది. కొండారెడ్డి బుర్జు దగ్గర కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. సిటీలోని హోటల్ మౌర్య సెంటర్ దగ్గర షూటింగ్ జరపనున్నారు. సీమ జిల్లాలో కర్నూలు జిల్లా నుంచి భారీ అభిమాన గణం సంపాదించిన స్టార్ ఆయన. గతంలో బాలయ్య నటించిన రాయలసీమ ఫ్యాక్షనిజం సినిమాల చిత్రీకరణకు కర్నూల్ అడ్డా. మళ్లీ చాలా కాలం తర్వాత బాలయ్య సినిమా షూటింగ్ కొండా రెడ్డి బురుజు దగ్గర జరగడం విశేషం.

ఇదీ చదవండి : ఎత్తు మూడు అడుగులే.. కానీ కాసుల వర్షం కురిపించింది.. ఎందుకంత స్పెషలో తెలుసా..?

ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ ‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

ఇదీ చదవండి : అహోబిలంలో భక్తుల సందడి.. ఆలయం చుట్టూ జలాల హోరు

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kurnool, Nandamuri balakrishna

ఉత్తమ కథలు