హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఈ కోటను చూస్తే మైమరచిపోవాల్సిందే...! అంతటి అద్భుత నిర్మాణం ఎలా సాధ్యమైందంటే..!

ఈ కోటను చూస్తే మైమరచిపోవాల్సిందే...! అంతటి అద్భుత నిర్మాణం ఎలా సాధ్యమైందంటే..!

కర్నూలు

కర్నూలు జిల్లాలో ఆకట్టుకుంటున్న అరుంధతి కోట

అరుంధతి సినిమా (Arundhathi Movie)... తెలుగు సినీ అభిమానులందరూ మెచ్చిన చిత్రం.. అందులో జేజమ్మగా అనుష్క (Anushka Shetty) నటన అద్భుతం..ఎప్పుడో వచ్చిన అరుంధతి సినిమా గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? ఆ సినిమాలో ఉన్న వైభవోపేతంగా కనువిందు చేసిన కోట గుర్తుందా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Banaganapalle (Banganapalle) | Kurnool

  Murali Krishna, News18, Kurnool

  అరుంధతి సినిమా (Arundhathi Movie)... తెలుగు సినీ అభిమానులందరూ మెచ్చిన చిత్రం.. అందులో జేజమ్మగా అనుష్క (Anushka Shetty) నటన అద్భుతం..ఎప్పుడో వచ్చిన అరుంధతి సినిమా గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? ఆ సినిమాలో ఉన్న వైభవోపేతంగా కనువిందు చేసిన కోట గుర్తుందా.. ఆ ఇంద్రభవనంలాంటి ఇంటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే వారేవా అనాల్సిందే..! ఇంతకీ ఆ కోట ఎక్కడుందో తెలుసా..! భారతదేశంలోని అతి పురాతనమైన కట్టడాలలో ఒకటి కర్నూలు జిల్లా (Kurnool District) బనగానపల్లె నవాబు బంగ్లా. అరుంధతి సినిమా రిలీజ్ తర్వాత దాదాపు అందరికీ ఈ బంగ్లా గురించి తెలిసిపోయింది. ఎంతోమంది అది ఎక్కడుందో వెతికి మరి వెళ్లి ఫొటోలు, సెల్ఫీలు దిగొచ్చారు కూడా. అయితే ఈ బంగ్లా వెనక ఉన్న రహస్యాలేంటో మీకు తెలుసా..!

  రాజా నంద చక్రవర్తి నుండి 1601లో బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ఈ బనగానపల్లి కోటను జయించాడు. కోటతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా సుల్తాన్‌ మెచ్చిన జనరల్ సిద్ధు సుంబాల్ నియంత్రణలో ఉండేవి. అతను వాటిని 1665 వరకు సంరక్షిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ముహమ్మద్ బేగ్ ఖాన్-ఇ రోస్‌బహానీకి మర్యాదపూర్వకంగా ఈ బనగానపల్లి, చుట్టుపక్కల ప్రాంతాలను ఇచ్చారు.

  ఇది చదవండి: రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుకు ప్రాణం పోసిన శిల్పి..! రాజసం ఉట్టిపడేలా విగ్రహ తయారీ..!

  అయితే ఆ రాజుకు వారసులు లేకపోవడంతో అతని దత్తపుత్రుడు ఫైజ్ అలీఖాన్ బహదూర్ వీటి పరిరక్షణ చూసుకునేవాడు. అప్పటి రాజులు బనగానపల్లెలోని తమ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కోసం ఊరికి దూరంగా ఎత్తైన కొండపై ఈ బంగ్లాను నిర్మించారు. 1947 వరకు బనగానపల్లి నవాబుల పాలనలో స్వతంత్ర రాష్ట్రంగా ఉంది.

  ఇది చదవండి: విశాఖ బీచ్‌లో అద్భుతం.. పురాతన నిర్మాణం గుర్తింపు.. ఆ యుద్ధకాలం నాటిదేనా..?

  కోటను చూస్తూ మైమరచిపోవాల్సిందే..!

  ఈ కోట ఆనాటి రాజ వైభవానికి మరియు భారతీయ వాస్తుశిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ఈ కోట నిర్మాణం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోవాల్సిందే. అంత గొప్పగా ఈ కోటను డిజైన్‌ చేశారు. ముఖ్యంగా ఈ కోట ఎంట్రన్స్‌ ..రెండు వైపులా మెట్లు ఎక్కి కోటలోకి వెళ్లేందుకు చేపట్టిన నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఈ కోటలోపల తొమ్మిది గదులు, ఒక పెద్ద హాల్‌ ఉంటుంది. ఇప్పటికీ చెక్కుచెదరని ఈ కోట నిర్మాణం అబ్బురపరుస్తుంది.

  ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!

  అనుష్క నటించిన అరుంధతి సినిమాతో ఈ కోటకు పూర్వం వైభవం వచ్చిందనే చెప్పుకోవాలి. వేసవి సెలవుల్లో, వీకెండ్స్‌, హాలిడేస్‌లో ఫ్యామిలీలతో కలిసి ఇక్కడకు వచ్చి కోట అందాలను తిలకిస్తుంటారు. కేవలం ఒక కర్నూలు జిల్లాకు సంబంధించిన వారే కాకుండా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ కోటను చూడ్డానికి సందర్శకులు వస్తుంటారు. ఎక్కువ శాతం యువత చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా వస్తుంటారు. ఈ కోటకు సంబంధించిన నవాబ్ గారి కుటుంబీకులు ఇప్పటికీ ఉండడంతో అది ప్రైవేటు వారి ఆధీనంలోనే ఉండిపోయింది. ఈ కోటను సందర్శించాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలకు రూ.30, పిల్లకు రూ.20 టికెట్‌ తీసుకోవాలి.

  అడ్రస్‌: నవాబ్‌ బంగ్లా (అరుంధతి కోట), బనగానపల్లె, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌- 518124

  Kurnool Fort Nawab Banglaw Map

  ఎలా వెళ్లాలి: కర్నూలు నుంచి బనగానపల్లెకు దాదాపు 80 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కర్నూలు నుంచి బెతంచెర్ల మీదగా బనగానపల్లె చేరుకుంటే చాలు.. అక్కడ నుండి 8 కిలోమీటర్లు యాగంటికి వెళ్లే దారిలో కుడివైపున ఈ బంగ్లా కనిపిస్తుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు