హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: మొన్నటి వరకు ఇంజనీర్.. ఇప్పుడు రైతు.. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

Kurnool: మొన్నటి వరకు ఇంజనీర్.. ఇప్పుడు రైతు.. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

X
ఒకప్పుడు

ఒకప్పుడు ఇంజనీర్.. ఇప్పుడు రైతు

Kurnool: హానికరమైన పురుగుల మందులు వాడకుండా సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన అనంతకృష్ణ. ఒకప్పుడు ఇంజనీర్ గా ఉన్న ఆయన.. ఇప్పుడు రైతుగా మారారు. ఎంత సంపాదిస్తున్నారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

T. Murali Krishna, News18, Kurnool

సాధారణంగా వ్యవసాయం అంటే మొన్నటి వరకు ఎవరూ మక్కువ చూపే వారు కాదు.. రైతులు సైతం ఉన్న వ్యవసాయాన్ని వదిలి.. వలసలు వెళ్లి కూలి పనులు చేసుకునే పరిస్థితే ఉంది ఆంధ్రప్రదేశ్ లో.. ఎందుకంటే వ్యవసాయంలో నష్టాలే తప్ప.. లాభాలు ఉండవని.. అప్పులు పెరిగిపోతాయని.. అతి వానలతో పంట నష్టం.. ఇలా వివిధ కారణాలతో వ్యవసాయానికి అంతా దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చాలామంది వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు.

వ్యవసాయ రంగంలో పంటలు పండించే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి. చాలా మంది రైతులు పంటలు పండించేందుకు నేటికీ పాత పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. హానికరమైన పురుగుల మందులు వాడకుండా సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన అనంతకృష్ణ.

ముంబైలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అనంతకృష్ణ వ్యవసాయంపై మక్కువతో వాళ్లకున్న మూడు ఎకరాల పొలంలో సొంత ఇల్లు కట్టుకొని సహజ సిద్ధమైన పంటలను పండిస్తున్నారు. తన కున్న మూడు ఎకరాల పొలాల్లో వివిధ రకాలైన పండ్లు, కూరగాయలను సాగు చేస్తున్నారు.

ఇదీ చదవండి : మారనున్న ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాలు!

తల్లిదండ్రులతో పాటు ఉన్న అనంతకృష్ణ ఊరి చివరనున్న పొలాల్లోనే ఏడు సెంట్ల స్థలంలో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. మిగిలిన స్థలంలో పావు ఎకరాల్లో దానిమ్మ సాగు, జామ తోట, రేగి పళ్ళతోట, అరటి తోట, ఉసిరి తోట, సీతాఫలం, సపోటా, మరియు టమాటోలు, వంకాయలు, ఇతర వివిధ రకాలైన కూరగాయలు పండిస్తున్నారు.

ఇదీ చదవండి : మత్తులో తూగుతున్న యువత.. ఈ జిల్లాలోనే అధికంగా అక్రమ మద్యం పట్టివేత..!

ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మొదట సరైన దిగుబడి రాకపోయినా మెల్లమెల్లగా భూమి సారవంతం పెరిగి మొక్కకు పోషకాలు అందించగల శక్తి ఏర్పడి దిగుబడి బాగా పెరుగుతుందంటున్నారు అనంతకృష్ణ. కానీ ఏదైనా పంట వేసే ముందు తగిన జాగ్రత్తలు పాటిస్తూ నేలకు తగినటువంటి నీటి వనరులు చూసుకుని ఒకే ఎకరాల్లో రెండు మూడు పంటలు వేసుకుని లాభాలు పొందవచ్చు అంటున్నారు.

ఇదీ చదవండి : రేషన్ దుకాణాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సేంద్రీయ ఎరువులు..!

పూర్తిగా కుళ్లిన సేంద్రియ ఎరువులు, వర్మికొంపోస్టు, గోబర్ గ్యాస్ వ్యర్థాలకు వాడడం, పరిశుభ్రమైన సాగు కలుపు నిర్మూలన, యాజమాన్యం సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు విరివిగా వాడడం లాంటి పద్దతులనే అనంతకృష్ణ పాటిస్తున్నారు.

ఇదీ చదవండి : మత్తులో యువత..రోజుకో మహిళపై దాడి

సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలు:

కాలుష్య నివారణకు దోహద పడుతుంది. జీవ వైవిద్యానికి నాంది పలుకుతుంది. మంచి జన్యు వైవిద్యo ఏర్పడుతుంది. సహజ వనరులు ప్రస్తుత కాలంలో ఉపయోగపడుటమే కాకుండా రాబోయే తరాల వారికి కూడా అందుబాటులో ఉంటాయి. పంట నాణ్యత, ఉత్పత్తులు, నిల్వ గుణం పెరుగుతాయి. సురక్షిత ఆహరం లభిస్తుంది. ఆహారంలోకి విష పదార్థాలు ప్రవేశించే అవకాశం ఉండదు. అధిక పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు. పంట మార్పిడి, అంతర పంటల వల్ల చీడపీడల ఉధృతి తగ్గి రైతు ఆర్ధికంగా బలపడతాడు. ఈ రైతు అయితే.. ఇంజనీర్ గా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ సంపాదిస్తున్నారు..

ఇదీ చదవండి : మండూస్ పై సీఎం జగన్ అలర్ట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఎలా వెళ్లాలి..?

కర్నూలుకి 20 కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్ వెళ్లే దారివైపు ఈ తాండ్రపాడు గ్రామంలోనే ప్రకృతి వ్యసాయం చేసే అనంతకృష్ణ ఇల్లు ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News

ఉత్తమ కథలు