హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: కర్నూలు అందాలకు ఫిదా అవ్వాల్సిందే..! టూరిజం స్పాట్ గా రాయలసీమ

Kurnool: కర్నూలు అందాలకు ఫిదా అవ్వాల్సిందే..! టూరిజం స్పాట్ గా రాయలసీమ

కర్నూలు సిటీ

కర్నూలు సిటీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో కర్నూలు (Kurnool) ఒకటి. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా.., రాయలసీమ (Rayalaseema) ప్రాంతానికి మకుటంగా ఉంది కర్నూలు. కర్నూలు అనగానే అందరికి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలకు నెలవు అనుకుంటారు.

ఇంకా చదవండి ...

Murali Krishna, News18, Kurnool

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో కర్నూలు (Kurnool) ఒకటి. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా.., రాయలసీమ (Rayalaseema) ప్రాంతానికి మకుటంగా ఉంది కర్నూలు. కర్నూలు అనగానే అందరికి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలకు నెలవు అనుకుంటారు. కానీ కర్నూలు సిటీలో ఇప్పుడు మరెన్నో సెల్ఫీ పాయింట్లు ఉన్నాయి. కొండారెడ్డి బురుజు అంటే తెలియని వాళ్లుండరు. అయితే కర్నూలులో ఇప్పుడు కొండారెడ్డి బురుజుకు అచ్చుగుద్దినట్లు ఉన్న మరొక కోట దానికి దగ్గరలోనే ఉంది. అదే మిని కొండారెడ్డి బురుజు. కర్నూలు అందాలను పెంచేలా అద్భుతమైన కట్టడాలతో కర్నూలులోని సి క్యాంపు సెంటర్ లో ఏర్పాటు చేసిందే ఈ సెల్ఫీ స్పాట్. ఇక్కడ అచ్చం కొండారెడ్డి బురుజు లాగే ఉన్న ఈ మీని కొండారెడ్డి బురుజుతో సెల్ఫీలు తీసుకునేందుకు కర్నూలు వాసులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ తొలి రాజధానిగా చిరస్థాయిగా గుర్తిండిపోయే కర్నూలుకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఏడో శతాబ్దంలో కర్నూల్ బీజాపూర్ సుల్తానులు, ఆ తర్వాత శ్రీ కృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని పాలించారు. అంతరించి పోతున్న కందనవోలు చరిత్రకు ప్రతికగా కొన్ని అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. నాటి కందనవోలు చిత్రాలు అంటూ నిర్మించిన ఈ ప్రదేశానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.

ఇది చదవండి: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బొంగు చికెన్ కోసం అరకు వెళ్లక్కర్లేదు..!


ఆ నాటి కాలంలో ఇల్లులు ఎలా ఉండేవి, కొండారెడ్డి బురుజు ..ఇలా మరెన్నో అద్బుతాలను కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. ఇక్కడ ఫొటో దిగితే కొండారెడ్డి కోట ఎక్కి ఫోటో దిగిన అనుభూతి కలుగుతుందంటున్నారు చిన్నారులు. చిత్రం భళారే విచిత్రం అంటూ మినీ కర్నూలు చిత్రాలకు స్థానికులు ఫిదా అవుతున్నారు.

ఇది చదవండి: వీళ్ల చేతుల్లో ఏదో అద్భుతం ఉంది.. ఏం చెేసినా జీవం ఉట్టిపడాల్సిందే..!


అంతే కాకుండా కర్నూలులోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్ లో ఏర్పాటు చేసినటువంటి \"క్లాక్ టవర్\" ప్రధానమైనది. దీన్ని కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసినటువంటి పోలీసులు, డాక్టర్స్, నర్సులు, మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల కష్టానికి గుర్తుగా వీటిని ఏర్పాటు చేశారు. రోబోలాంటి ఈ బొమ్మలో గడియారాన్ని అమర్చారు.

ఇది చదవండి: అక్కడ ఏ టిఫిన్ అయినా 10 రూపాయలే..! ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..


ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయడంతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ముక్యంగా చిన్నపిల్లలలు ఆడుకోవడానికి వీలుగా ఇలా రోడ్డు మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటిని నిర్మించడం విశేషం. ప్రజలను ఆకట్టుకుంటున్న సెల్ఫీ స్పాట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏపీ భవిష్యత్ న్యాయరాజధానిగా ప్రచారంలో ఉన్న కర్నూలుపై ప్రభుత్వం దృష్టిపెట్టి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool

ఉత్తమ కథలు