Home /News /andhra-pradesh /

KURNOOL MILLETS FOOD COURT THAT PREPARING MILLET FOOD ATTRACTING PEOPLE IN KURNOOL FULL DETAILS HERE PRN KNL NJ

Kurnool News: బ్యాక్‌ టు రూట్స్‌ అంటున్న ప్రజలు... మిలెట్స్‌ టిఫెన్‌ సెంటర్‌కు పెరుగుతున్న క్రేజ్‌!

కర్నూలులో

కర్నూలులో మిల్లెట్స్ హోటల్

Millet food: మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతుంది. ప్రతిరోజు ప్రపంచంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త వైరస్‌ వెలుగుచూస్తూనే ఉంటుంది. ఈ వైరస్‌లకు భయపడే కన్నా..మన శరీరాన్ని ధృడంగా, ఆరోగ్యకరంగా ఉంచుకుంటే ఎలాంటి వైరస్‌ను అయినా తరిమికొట్టొచ్చంటున్నారు నిపుణులు.

ఇంకా చదవండి ...
  Murali Krishna, News18, Kurnool

  మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతుంది. ప్రతిరోజు ప్రపంచంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త వైరస్‌ వెలుగుచూస్తూనే ఉంటుంది. ఈ వైరస్‌లకు భయపడే కన్నా..మన శరీరాన్ని ధృడంగా, ఆరోగ్యకరంగా ఉంచుకుంటే ఎలాంటి వైరస్‌ను అయినా తరిమికొట్టొచ్చంటున్నారు నిపుణులు. దీంతో ప్రజలు తమ ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు. శరీరాన్ని బలంగా ఉంచుకునేందుకు మన పూర్వికులు తినే ఆహార పదార్థాలపై మొగ్గు చూపుతున్నారు. చాలా మంది ప్రజలు తమ ఆహార అలవాట్లు మార్చుకుంటూ తమ పూర్వికులు తినే రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు, చేసే వంటకాలపై మొగ్గుచూపుతున్నారు. కొందరు మాత్రం వారి ఇళ్లలోనే రోజు వారి వంటకాలలో ఒకటిగా చిరుదన్యాలతో చేసినటువంటి వంటలను చూసుకుంటున్నారు. ఆలా చేయలేని వారి కోసం వినూత్న ఆలోచనతో ఏర్పాటు చేసినదే కర్నూలులోని శ్రీ లక్ష్మి మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్.

  ఉద్యోగం పోయినా తానే ఉపాధి కల్పించుకున్నాడు
  మధు నాయుడు బీటెక్ పూర్తి చేసి ఒక ప్రైవెట్ ఉద్యోగం చేస్తుండేవాడు. కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం పోయినా.. ఎక్కడ అధైర్య పడకుండా సొంత కాళ్లపై నిలబడాలనుకున్నాడు. ఏదైనా వ్యాపారం చేసి తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉదేశంతో తక్కువ పెట్టుబడితో వినూత్న ఆలోచనతో మొదలు పెట్టిందే లక్ష్మీస్ మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్.

  ఇది చదవండి: ప్రభాస్ థియేటర్లో ఫారిన్ పెళ్లి.. వధువు తండ్రి వినూత్న ఆలోచన.. సిల్వర్ స్క్రీన్ పై మ్యారేజ్..


  చిరుధాన్యాలపై ప్రజలకు మరింత అవగాహన..?
  ప్రజల ఆరోగ్య ఆహారపు అలవాట్లు మార్పు కోసం తనవంతు కృషి చేస్తూ మన పూర్వికులు తినే టిఫిన్స్ అందరికి అందుబాటులో ఉడేలా మిల్లెట్స్ తో చేసిన టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా హోటల్ చిన్నదే అయినా ప్రజలకు చిరుధాన్యాలలో ఉండే పోషకాలపై అవగాహన కల్పిస్తూ ఏ చిరుధాన్యాలలో ఎన్ని పోషకాలు ఉంటాయి అనేది తెలిసేలా ఒక పెద్ద బోర్డు ఏర్పాటు చేసాడు.  ఇది చదవండి: ఏపీలో టెన్త్ పాస్, ఫెయిల్ అయిన వారికి అలర్ట్.. ఫ్రీ ట్రైనింగ్ తో పాటు జాబ్ గ్యారెంటీ.. ఇలా రిజిస్టర్ చేసుకోండి.. రేపే లాస్ట్ డేట్..


  చిరుధాన్యాల విశిష్టత
  సహజ పీచు పదార్థం కలిగి ఉండటమే చిరుధాన్యల ప్రత్యేకత. వీటిని మూడు పూటలా తిన్నపుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన 25-30 గ్రాముల పీచు పదార్థం దాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాయలు, ఆకుకూరల నుండి పొందవచ్చు. ఒక్కొక్క చిరుధాన్యం కొన్ని రకాల దేహపు అవసరాలను, ప్రత్యేకమైన రోగ నిర్ములన శక్తిని కలిగి ఉంటాయి.

  ఏ చిరుధాన్యం దేనికి పని చేస్తుంది.?
  1. కొర్రలు (Foxtail Millet):- నరాల శక్తి మానసిక దృఢత్వం, అర్థరైటీస్, పార్కిన్సన్ రోగాలనుంచి విముక్తి
  2. అరికెలు (Kodo Millet ):- రక్త శుద్ధి, రక్త హీనత, రోగానిరోధక శక్తిని పెంపొందించే పోషకాలు కలిగి ఉంటుంది
  3. ఊదలు ( Branyard Millet ):- లివర్ కిడ్నీ, కోలేస్త్రోల్ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
  4. సాములు ( Little Millet ) :- అండాశయం, వీర్యాకణాల సమస్యలు, పిసిఓడి, సంతానలేమి, సమస్యల నివారణ
  5. అండుకొర్రలు ( Brown Millet ) :- జిర్ణశయం, అర్ధరైటిస్, బి. పి. దైర్యయిడ్, కంటి సమస్యలు, ఉబకాయ నివారణ
  6. రాగులు ( Ragi Millet ):- బరువు తగ్గుట, ఎముకల గట్టితనంకు దోహదపడుతుంది.
  ఇలా అందరికి చిరుధాన్యలపై అవగాహనా కల్పిస్తున్నారు.

  ఇడ్లీల లోనే 7 వెరైటీలు
  1.కొర్ర ఇడ్లీ
  2. రాగి ఇడ్లీ
  3.జొన్న ఇడ్లీ
  4. ఉదల ఇడ్లీ
  5.అరికెల ఇడ్లీ
  6.సామ్యూలా ఇడ్లీ
  7. సజ్జల ఇడ్లీ.

  7 వెరైటీ పదార్థాలతో  ఉప్మా
  1.కొర్ర ఉప్మా
  2. రాగి ఉప్మా
  3.జొన్న ఉప్మా
  4. ఉదల ఉప్మా
  5. అరికెల ఉప్మా
  6.సముల ఉప్మా
  7. సజ్జల ఉప్మా

  అంతేకాకుండా చిరు దాన్యాలతో చేసిన దోసెలు, గోంగూర చెట్నీ ఇక్కడి స్పెషల్ రాగి జావ, బెల్లం టీ, ఇలా అన్ని అల్పాహారాలు ప్రజలను అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ టిఫెన్స్‌ చాలా ఆరోగ్యకరంగా ఉంటాయని ఫుడ్‌ లవర్స్‌ చెబుతున్నారు. పక్కనే సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానం ఉండటంతో మార్నింగ్‌ వాకింగ్‌కు వచ్చే వాళ్లు, విద్యార్థులు, వృద్దులు. రిటైర్డ్ ఆఫీసర్స్ ఇలా ఎంతో మంది వీటిని తినేందుకు క్యూ కడుతున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు