హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sad Story: వేరు కాపురం పెట్టాలంటూ గొడవ.. చిన్నకారణంతో కుటుంబమంతా చిన్నాభిన్నం..

Sad Story: వేరు కాపురం పెట్టాలంటూ గొడవ.. చిన్నకారణంతో కుటుంబమంతా చిన్నాభిన్నం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఈ రోజుల్లో అన్నీ చిన్నకుటుంబాలే. పెళ్లయిన కొన్నాళ్లకే కొత్తకాపురం పెట్టాలని మహిళలు పట్టుబడుతుంటారు. ఇలాంటి విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. తాజాగా కర్నూలు సిటీలో కాపురం పెట్టాలనే ఆశతో ఆ భార్య క్షణికావేశంలో చేసిన పనికి ఆ కుటుంబమే చిన్నాభిన్నమైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

ఈ రోజుల్లో అన్నీ చిన్నకుటుంబాలే. పెళ్లయిన కొన్నాళ్లకే కొత్తకాపురం పెట్టాలని మహిళలు పట్టుబడుతుంటారు. ఇలాంటి విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. తాజాగా కర్నూలు (Kurnool) సిటీలో కాపురం పెట్టాలనే ఆశతో ఆ భార్య క్షణికావేశంలో చేసిన పనికి ఆ కుటుంబమే చిన్నాభిన్నమైంది. ఇద్దరు పిల్లలు మృతి చెందడం, భర్త దూరమవ్వడం, జైలుకెళ్లడం.. ఇవ్వన్ని తన వల్లే అనే మనస్థాపంతో 28 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు మండలం పూల తోట గ్రామంలో నివాసం ఉంటున్న వివాహిత మనీషా (28) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆలూరు మండలం మెలగవల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డితో మనిషాకు 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే మనీషా కర్నూలులో కాపురం పెట్టాలని తరచూ భర్త పవన్ కుమార్ రెడ్డితో గొడవ పడుతుండేది.., అందుకు భర్త నిరాకరించడంతో పిల్లలిద్దరిని తీసుకొని పుట్టింటికి వచ్చింది.

తల్లిదండ్రులు మనిషాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన మనీషా ఈ ఏడాది మార్చి 5వ తేదీన పిల్లలిద్దరిని తీసుకుని పూల తోట గ్రామ శివారులోని బావిలోకి దూకింది గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ పిల్లలిద్దరూ మరణించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన మనీషా.. తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. పిల్లలిద్దరూ చనిపోవడం భర్త దూరం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మనీషా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇది చదవండి: పిల్లలు కనిపించలేదని కంగారుపడ్డ తండ్రి.. భార్యకు ముఖం చూపించలేక ఏంచేశాడంటే..!

కడుపు నొప్పి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య..!

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పి.చింతకుంటకు చెందిన విద్యార్థిని అంబటి మౌనిక (18) గురువారం వేకువజామున ఆత్మహత్యకు పాల్పడింది. గత మూడేళ్లుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు తండ్రి మద్దిలేటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి విపరీతంగా కడుపు నొప్పి రావడంతో మాత్రలు వేసుకుని నిద్ర పోయిందని, వేకువజామున 4 గంటల సమయంలో ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా మెలకువలోకి రాలేదని.. అనుమానం వచ్చి వైద్యుడిని పిలిపించానని మౌనిక తండ్రి పోలీసులకు తెలిపారు.

ఇది చదవండి: గోదావరి జిల్లాల్లోనూ గంజాయి మాఫియా..! విశాఖ మన్యానికే ఎగుమతి.. సూత్రధారులు వాళ్లేనా..?

అప్పటికే మౌనిక మృతి చెందినట్లు వైద్యుడు చెప్పాడు. ఆమె సమీపంలో పెద్ద ఎత్తున ఖాళీ బీపీ మాత్రల అట్టలు కనిపించాయి.దీంతో కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏఎస్సై మల్లేశ్వరరెడ్డి తెలిపారు. మౌనిక ఇంటర్‌ ఉత్తీర్ణురాలై డిగ్రీ చేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్న ఒక్కగానొక్క కూతురును కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు