హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పట్టపగలే వ్యక్తి దారుణ హత్య.. కత్తులు కర్రలతో దాడిచేసి చంపేశారు.. కారణమిదే.!

పట్టపగలే వ్యక్తి దారుణ హత్య.. కత్తులు కర్రలతో దాడిచేసి చంపేశారు.. కారణమిదే.!

హత్యకు వాడిన కత్తి

హత్యకు వాడిన కత్తి

కొచ్చెరువులో శీను గ్రానైట్ మైనింగ్ పనులు చేస్తుండే వాడని గుర్తించిన పోలీసులు... కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Dhone (Dronachalam), India

(మురళీ కృష్ణ, న్యూస్18 తెలుగు, కర్నూలు)

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో హత్య రాజకీయాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఈ మధ్యకాలంలో డోన్ పట్టణంకొండపేట సమీపంలో బైక్పై వెళ్తున్న ఇద్దరినీ పట్టపగలే నడిరోడ్డుపై కాపు కాచి కంట్లో కారం చల్లి.. కత్తులతోదాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. అలాంటి సంఘటనే తాజాగా డోన్ నియోజకవర్గంలో మరొకటి చోటుచేసుకుంది.

డోన్ నియోజకవర్గంలోని కొచ్చేరువు గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని పట్టపగలే అతికిరాతకంగా కత్తులు కర్రలతో దాడి చేసి హతమార్చారు కొంతమంది దుండగులు. అయితే అటుగా వెళుతున్న కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న డోన్ పట్టణ పోలీసులు చనిపోయిన వ్యక్తి కొచ్చేరువు గ్రామానికి చెందిన లద్దగిరి శ్రీనుగా గుర్తించారు.

మహిళా ఉద్యోగికి బీఆర్ఎస్ నేత ఫోన్.. కాసేపటికే నిద్రమాత్రలు మింగి

కొచ్చెరువులో శీను గ్రానైట్ మైనింగ్ పనులు చేస్తుండే వాడని గుర్తించిన పోలీసులు... కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చనిపోయిన వ్యక్తి శ్రీనును పాత కక్షలో నేపథ్యంలో టిడిపి పార్టీకి చెందిన వ్యక్తులే ఈ హత్య చేసుంటారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ ఫిర్యాదు మేరకుఘటన జరిగిన ప్రాంతంలోని లభించిన ఆయుధాల ఆధారంగా పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందం ద్వారా నిందితులనుపట్టుకునే పనిలో పడ్డారు.

డోన్ పట్టణంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఇలా తరచూ జరుగుతుండడం సామాన్య ప్రజలను తీవ్రంగా కలచివేస్తుంది. కొంతమంది ప్రజలు మాత్రం డోన్ పట్టణంలో శాంతిభద్రతల విషయంలో పోలీసు యంత్రాంగంపూర్తిగా విఫలం అయిందని ఆరోపిస్తున్నారు.

First published:

Tags: Crime news, Kurnool, Local News

ఉత్తమ కథలు