Home /News /andhra-pradesh /

KURNOOL MAN INJURED IN KNIFE ATTACK IN KURNOOL KNL NJ ABH

Kurnool: పట్టపగలే కత్తులతో వీరంగం.. వ్యక్తిపై వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి..!

పట్టపగలే కత్తులతో వీరంగం

పట్టపగలే కత్తులతో వీరంగం

పట్టపగలే కత్తులతో దాడి, పెళ్లికావడం లేదంటూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రైతు, వీధి కుక్కను చంపారంటూ వైద్యవిద్యార్థులపై కేసు వంటి కర్నూలు జిల్లా క్రైమ్‌ వార్తల రౌండప్‌ ఒకసారి చూద్దాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    (T.Murali Krishna, News 18, Kurnool)

    పట్టపగలే కత్తులతో దాడి, పెళ్లికావడం లేదంటూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రైతు, వీధి కుక్కను చంపారంటూ వైద్యవిద్యార్థులపై కేసు వంటి క్రైమ్‌ వార్తల రౌండప్‌ ఒకసారి చూద్దాం.

    పట్టపగలే వ్యక్తిపై కత్తులతో దాడి
    నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పట్టపగులే కత్తులతో దాడి చేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శ్రీను అనే వ్యక్తి తన ఇంటి మెట్లు ఎక్కుతుండగా.. వెనకనుంచి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అతన్ని కత్తులతో పొడిచి పరారయ్యారు. శ్రీను గట్టిగా కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వాళ్లు రావడంతో దుండగులు కత్తిని అక్కడే పడేసి పరుగులు తీశారు.

    శ్రీను అక్కడికక్కడే స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాతకక్షలా మరేవిధమైనా కారణాలో దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

    వీధి కుక్కను చంపారంటూ వైద్య విద్యార్థులపై కేసు..!

    కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని కాన్పుల వార్డు దగ్గర తీవ్రగాయాలతో పడి ఉన్న కుక్కను సెక్యూరిటీ సిబ్బంది గమనించి.. వెల్ఫేర్ ఆఫ్ అనిమల్స్ లిబర్టీ ఉపాధ్యక్షురాలు మానస ప్రియాకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మానస ప్రియ గాయాలతో పడి ఉన్న కుక్కను తీసుకెళ్లి వైద్యం చేయిస్తుండగా అది మరణించింది. వెటర్నరీ డాక్టర్ తో కుక్క కలేబరాన్ని పోస్ట్‌మార్టం చేయించి ఖననం చేశారు. అయితే కుక్క చావుకి వైద్య విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కారణమంటూ కర్నూలులోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    గుర్తు తెలియని వాహనం ఢీకొని..!
    పాణ్యం మండలంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనం ఈశ్వర్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    పెళ్లి కావట్లేదని ...!
    రుద్రవరం మండలానికి చెందిన నాగ నరసింహ (24) పెళ్లి కావట్లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు తనకున్న నాలుగు ఎకరాలతో పాటు అదనపు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సరిగా పండకపోవడతో.. నాలుగు లక్షలు అప్పు అయ్యింది. దెబ్బమీద దెబ్బ అన్నట్లుగా… తీవ్ర మనస్థాపం గురైన నాగ నరసింహ రెండు రకాల పురుగుల మందు కలిపి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నరసింహన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Kurnool, Local News, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు