హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Living Relationship: మ్యాట్రిమనీలో పరిచయం.. రెండు నెలలు సహజీవనం.. ఓ అర్ధరాత్రి ఊహించని ట్విస్ట్...

Living Relationship: మ్యాట్రిమనీలో పరిచయం.. రెండు నెలలు సహజీవనం.. ఓ అర్ధరాత్రి ఊహించని ట్విస్ట్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cheating: తాను రాజమండ్రిలో జాబ్ చేస్తున్నానని ఆమెకు చెప్పాడు. మీరు నచ్చారని.. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. అలా దగ్గరై రెండు నెలల పాటు కర్నూలులోనే ఆమెతో సహజీవనం చేశాడు.

  జీవితంలో ఒక తోడు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం నచ్చిన వారిని, పెద్దలు చూసిన వారిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. ఈ రోజుల్లో తెలిసినవారు, బంధువులు చూసే పెళ్లి సంబంధాలే కాకుండా మ్యాట్రిమోనీ సైట్ల ద్వారానూ వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఐతే ఈ మ్యాట్రిమనీ సైట్లే కొందరి కొంపముంచుతున్నాయి. అలా ఓ మహిళకు మ్యాట్రిమని వెబ్ సైట్లో పరిచయమైన ఓ వ్యక్తి ఆమెతో సహజీవనం చేయడమే కాకుండా డబ్బులు, నగదుతో ఉడాయించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు (Kurnool) నగరంలోని బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే భర్తతో మనస్పర్ధరు రావడంతో విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించింది.

  వెంటనే ఓ మ్యాట్రిమనీ వెబ్ సైట్లో వివరాలను రిజిస్టర్ చేసుకుంది. అలా చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను రాజమండ్రిలో జాబ్ చేస్తున్నానని ఆమెకు చెప్పాడు. మీరు నచ్చారని.. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. అలా దగ్గరై రెండు నెలల పాటు కర్నూలులోనే ఆమెతో సహజీవనం చేశాడు. తనపై పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత ఆమె వద్ద ఉన్న ఎనిమిది తులాల బంగారం, రూ.2లక్షల నగదు తీసుకొని పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  ఇది చదవండి: భార్య ఆలస్యంగా రావడంతో మొదలైన గొడవ.. చివరికి ఎక్కడవరకు వెళ్లిందంటే..!  ఇటీవల గుంటూరు జిల్లాలో ఇలాంటి మోసమే జరిగింది. సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ.. అబ్బూరులోని ఓ బ్యాంక్ లో పనిచేస్తోంది. ఆమె రెండో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా ఓ మ్యాట్రిమోనీ సైట్ లో కార్తీక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తమది గుంటూరు జిల్లా తెనాలి అని.. చెన్నై ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయినట్లు ఆమెను నమ్మించాడు. నువ్వు బాగా నచ్చావని.. పెళ్లి చేసుకుంటానని తియ్యగా మాట్లాడి ముగ్గులోకి దించాడు. కొన్నిరోజుల తర్వాత అసలు కథ మొదలుపెట్టాడు.

  ఇది చదవండి: ప్రేమించానంటే నమ్మింది.. అంతా అయ్యాక ఇలా చేస్తాడనుకోలేదు..  తన కుటుంబానికి చెందిన ఆస్తులను నోట్లరద్దు సమయంలో విక్రయించానని.. ఆ సమయంలో కోట్లాది రూపాయల డబ్బు బ్యాంక్ లో ఉందని చెప్పాడు. ఆ డబ్బును ఐటీ అధికారులు నిలిపేశారని.. ప్రస్తుతం అది చెన్నై కోర్టులో ఉందని నమ్మించాడు. ఐటీ అధికారులకు డబ్బులిస్తే కోట్లాది రూపాయలు సొంతమవుతాయని చెప్పి ఆమె దగ్గర రూ.32 లక్షలు తీసుకున్నాడు. తన మేనత్త ఖాతాలో డబ్బులు వేయాలంటూ ఓ ఎకౌంట్ నెంబర్ ఇచ్చాడు. అతడు చెప్పిన మాటలు నమ్మి మహిళ.. అప్పుచేసి మరీ సదరు ఎకౌంట్ లో డబ్బులు జమ చేసింది.

  ఇది చదవండి: ఆమెకు 17, అతడికి 20.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ వారి జీవితం ఊహించని మలుపు తిరిగింది..!  ఐతే కొంతకాలం కార్తీక్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించింది. పూర్తి వివరాలు ఆరా తీయగా తనకు పరిచయమైన వ్యక్తిపేరు కార్తీక్ కాదని.. అతడి పేరు మహరాజ్ జానీ రెక్స్ అని.. అతడికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుసుకుంది. ఇతగాడు ఇచ్చిన ఎకౌంట్ నెంబర్ తన మేనత్తది కాదని.. భార్యదని తెలుసుకొని బాధితురాలు కంగుతింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Love cheating

  ఉత్తమ కథలు