హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: రాంగ్ నంబర్ తో కలిసిన లవర్స్.. రేపో మాపో పెళ్లనగా అబ్బాయి ఫోన్ స్విఛ్ ఆఫ్.. తర్వాత జరిగిందంటే..!

Andhra Pradesh: రాంగ్ నంబర్ తో కలిసిన లవర్స్.. రేపో మాపో పెళ్లనగా అబ్బాయి ఫోన్ స్విఛ్ ఆఫ్.. తర్వాత జరిగిందంటే..!

దీంతో.. పోలీసులు ఆ యువతి తల్లిదండ్రులకు ఒక్కటే చెప్పారు. వాళ్లిద్దరూ మేజర్లని.. పెళ్లి కూడా చేసుకున్నారని.. చట్టం ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఆ ఇద్దరికీ ఉందని.. వాళ్ల ప్రేమ పెళ్లిని ఆమోదించాలని సూచించారు. అయితే.. పోలీసులు కౌన్సిలింగ్ తీసుకుని సర్ది చెప్పడంతో యువతి తల్లిదండ్రులు ఎట్టకేలకు ఆ ప్రేమపెళ్లిని ఆమోదించారు. ఆ యువకుడిని అల్లుడిగా ఒప్పుకున్నారు. దీంతో.. కథ సుఖాంతమైంది.

దీంతో.. పోలీసులు ఆ యువతి తల్లిదండ్రులకు ఒక్కటే చెప్పారు. వాళ్లిద్దరూ మేజర్లని.. పెళ్లి కూడా చేసుకున్నారని.. చట్టం ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఆ ఇద్దరికీ ఉందని.. వాళ్ల ప్రేమ పెళ్లిని ఆమోదించాలని సూచించారు. అయితే.. పోలీసులు కౌన్సిలింగ్ తీసుకుని సర్ది చెప్పడంతో యువతి తల్లిదండ్రులు ఎట్టకేలకు ఆ ప్రేమపెళ్లిని ఆమోదించారు. ఆ యువకుడిని అల్లుడిగా ఒప్పుకున్నారు. దీంతో.. కథ సుఖాంతమైంది.

పొరబాటున చేసిన ఫోన్ కాల్ తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తీరా పెళ్లనగా అమ్మాయికి ఊహించని షాక్

  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  స్మార్ట్ ఫోన్ పుణ్యమాని దూరంగా ఉన్నవారు కూడా దగ్గరగా ఉన్నట్లు ఫీలింగ్ కలిగిస్తోంది. ఎదుటి వారు ఎక్కడ ఉన్న సరే వారితో మాట్లాడాలన్నా, వారిని చూడాలన్న చిటికెలో పని. ఒక్కో సారి ఒకరికి చేయాల్సిన కాల్స్ మరొకరికి వెళుతూ ఉంటాయి. ఇవన్నీ సర్వసాధారణమే అనుకుంటాం. కానీ ఇలా చేసే కాల్స్ కొందరి జీవితాలకు పూజ బాట వేస్తుంటే చాల మంది జీవితాలను పాతాళంలోకి నెట్టేస్తుంది. పాయకరావు పేటకు చెందిన యువతీ బిటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తోంది. బిటెక్ సమయంలో మిత్రురాలికి చేయాల్సిన కాల్ ను వేరొక నెంబర్ కు చేసేసింది. దీంతో ఆదోనికి చెందిన దేవానంద్ అనే వ్యక్తికి కాల్ చేసింది. చేసింది రాంగ్ నెంబర్ కు అయినా ఆ యువకుడి మాటలు మెచ్చిన యువతి అతనికి తరచు కాల్ చేయ సాగింది. అమ్మాయి ఒకసారి కాల్ చేస్తే.. దేవానంద్ మాత్రం రోజుకు ఐదు నుంచి పది సార్లు కాల్ చేసే వాడు. ఇలా వీరి ఫోన్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

  ప్రేమకాస్తా ముదిరి పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరు అష్టకష్టాలు పడి ఇరువైపుల పెద్దలను ఒప్పించారు. దీంతో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ జరిపారు. బంధువు మిత్రుల సమక్షంలో ఇద్దరు ఒకరి చేతి వేళ్ళకు మరొకరు రింగులు తొడుగుకున్నారు. కట్నకానుకలు... బంగారు ఆభరణాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అంతా సవ్యంగా జరగడంతో వివాహ ముహూర్తం ఖరారు చేశారు. శుభలేఖలు కూడా ప్రెంట్ అయ్యాయి. బంధుమిత్రులకు కూడా పంచిపెట్టారు. అయితే నిశ్చితార్థం అయిన రెండు వారాలకు దేవానంద్ ఫోన్ స్విచ్ అఫ్ అయింది. రెండు నెలలు కావొస్తున్నా అతని మొబైల్ మాత్రం అందుబాటులోకి రాలేదు.

  ఇది చదవండి: పెళ్లైన 30ఏళ్ల తర్వాత భార్యపై అనుమానం... కోపంతో ఆ భర్త ఏం చేశాడంటే..!


  దీంతో అనుమానం వచ్చిన యువతి తల్లితండ్రులు దేవానంద్ ఇంటికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ నెల 21వ తేదీ వేరొక యువతితో వివాహం జరిగినట్లు తెలిసింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు దేవానంద్ తల్లిదండ్రులను నిలదీశారు. అయితే అతడి తరపు బంధువులు వీరిపై దాడిచేశారు. దీంతో యువతి తరపు వారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దేవానంద్ చేతిలో మోసపోయామని గ్రహించిన యువతీ తీవ్ర మనోవేదనకు గురైంది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ పోలీసులకు తన గోడు వెళ్లబోసుకుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Love cheating

  ఉత్తమ కథలు