Home /News /andhra-pradesh /

KURNOOL MAJOR BUS ACCIDENT IN NANDYALA KNL NJ ABH

Kurnool : నంద్యాలలో 'జర్నీ' సినిమా సీన్‌ రిపీట్‌..! హైదరాబాద్‌ వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..!

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులు 

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులు 

నంద్యాలలో జర్నీ సినిమా సీన్‌ రిపీట్‌ అయ్యింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. మరోవైపు టిప్పర్‌ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి..రెండు బైక్‌లు ఢీ కొని వ్యక్తి మృతి.. వంటి కర్నూలు జిల్లా క్రైమ్‌ వార్తలను ఒకసారి చూద్దాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    T.Murali krishna, News 18, Kurnool

    Kurnool: నంద్యాల - కర్నూలు బైపాస్ రోడ్డు సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నంద్యాల నుంచి కూకట్‌పల్లికి (kukatpally) వెళ్తున్న డిపో బస్సును… ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న బస్సు వేగంగా ఢీకొట్టింది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

    టిప్పర్ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి..!
    వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్‌ ఢీకొనడంతో వ్యవసాయకూలీ మృతి చెందాడు. పత్తికొండ మండలం అటికల గూడెం గ్రామానికి చెందిన కొందరు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లి వస్తున్న సమయంలో….. వీరు ప్రయాణిస్తున్న ఆటోను వెనక వైపు నుంచి టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గోవిందప్ప(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు.

    కాల్వలో కొట్టుకొచ్చిన వృద్ధుడు..!
    నంద్యాలలో ఒక వృద్ధుడు కాలువలో కొట్టుకొచ్చిన ఘటన అయ్యలూరు మెట్ట వద్ద చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని కాలువ నుంచి బయటికి తీసుకు వచ్చి కాపాడారు. అతని జేబులో ఉన్న ఆధార్ కార్డు తీసి చూడగా… రుద్రవరం మండలం తువ్వ పల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్‌ రెడ్డిగా గుర్తించారు.

    అప్పుల బాధ తాళలేక..!
    చింతమాను పల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య(55) అనే రైతు తనకున్న మూడు ఎకరాల పొలంలో ఐదు లక్షల అప్పు చేసి పంట వేశాడు. అయితే దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన తిరుపతయ్య పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో వాళ్లతో చెప్పి… పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

    Read this also; Vizag News: చూడటానికి ఇది పార్క్ మాత్రమే.. కానీ లోపలికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు..!



    రెండు బైక్‌లు ఢీకొని..!
    కర్నూలులోని రాజ్ విహార్ కూడలి వద్ద ఉన్న నది వంతెన పై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తి మృతి చెందాడు. కర్నూలులోని పాత బస్తీకి చెందిన షబ్బీర్ అహ్మద్ స్వర్ణకారుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కర్నూలులోని రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లి… తన పని ముగించుకొని బైక్‌పై వస్తుండగా.. వెనకవైపు నుంచి వచ్చిన మరో బైక్‌ అతన్ని ఢీకొనడంతో షబ్బీర్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపే మార్గ మధ్యలో మరణించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News, Road accidents

    తదుపరి వార్తలు