హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ కోనేరులో మునిగితే చర్మవ్యాధులు పోతాయంటా.. ఎక్కడో తెలుసా..?

ఆ కోనేరులో మునిగితే చర్మవ్యాధులు పోతాయంటా.. ఎక్కడో తెలుసా..?

X
మహానంది

మహానంది కోనేరు నీటిలో మహత్యం

Mahanandi: పుణ్యక్షేత్రంలో మాత్రం నిత్యం నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఆ పుష్కరిణిలో తేటగా నీళ్లు ఉండటమే గాక.. చర్మరోగాలు పోతాయంటా.. అంతే కాదు.. ఏడాది పొడవునానీరు ఇంకిపోకుండా ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Nandyal | Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

సాధారణంగా మనం దేవలయాలకో, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్తే చాలా చిన్నపాటి చెరువులాగా ఉండే కోనేరు చూసి ఉంటాం.. అక్కడే స్నానాలు ఆచరించి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తుంటాం. అలా చేయటం ద్వారా మన పాప పరిహరాలు పోతాయని నమ్మకం... అయితే ఆ నీరు ఎంత వరకు మంచిదో గమనించం... కానీ ఓ పుణ్యక్షేత్రంలో మాత్రం నిత్యం నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఆ పుష్కరిణిలో తేటగా నీళ్లు ఉండటమే గాక.. చర్మరోగాలు పోతాయంటా.. అంతే కాదు.. ఏడాది పొడవునానీరు ఇంకిపోకుండా ఉంటాయి. కాలానుగుణంగా చలికాలంలో వెచ్చగాను.. వర్షకాలంలో మలినాలు లేకుండా.. ఎండాకాలంలో చల్లగా ఉంటాయని అక్కడి భక్తులు చెబుతున్నారు. అసలు ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టోరీ చదివేయండి.

ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) నంద్యాల పట్టణంలోఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది మహానంది పుణ్యక్షేత్రం. మన పూర్వీకులు నిర్మించిన దేవాలయాల్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో మనకు కొన్ని మాత్రమే తెలుసు.. మనకు తెలియని మిస్టరీ దేవాలయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. అందులో ఒక దేవాలయమే మహానంది పుణ్యక్షేత్రం. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడి నీటిని తీర్థంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహానంది ఆలయ విశిష్టత, ఇక్కడ ఉండే ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది చదవండి: స్వామి దర్శనం అనంతరం గోమాత ఆశీర్వాదం తీసుకోవడం అక్కడి ప్రత్యేక ఆచారం..!

మహానంది క్షేత్రంలోని ప్రధాన పుష్కరిణిలోకి వచ్చే నీరు, గాలి గోపురం ముందు వైపు రెండు గుండాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల అక్కడుండే పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదిగా.. పరిశుభ్రంగా ఉంటుంది. శివుని యొక్క లింగం నుండి వచ్చే ఈ నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి వేసవికాలంలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా.. వర్షాకాలంలో మలినాల్లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.

ఇది చదవండి: ఇళ్లు ఇస్తామంటే ఏదో అనుకున్నారు..? ఇందుకేనా..?

ఇక్కడ ఉన్న నీటిలోకి మనం ఏదైనా నాణేన్ని వేసినా.. లేదా చిన్న గుండుసూది వేసినా కూడా ఐదు అడుగుల లోతులో ఉన్న నీటిలో నుండి అవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దేవాలయం ఆవరణంలోని బావులలోకి ఈ స్వచ్ఛమైన నీరు మనకు కనబడుతుంది. ఈ నీటిని భక్తులందరూ తీర్థంగా భావిస్తారు. ఈ మహానంది క్షేత్రంలోని నీరే సుమారు 2వేల నుంచి 3 వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తోంది. నల్లమల అటవీప్రాంతం నుంచి అనేక వనమూలికలను తాకుతూ వచ్చే ఈ నీటిలో చర్మ సంబంధిత వ్యాధులు పూర్తిగా నయం అవుతాయని అక్కడి భక్తులు తెలుపుతున్నారు.

First published:

Tags: Kurnool, Local News, Nandyal, Telangana

ఉత్తమ కథలు