Home /News /andhra-pradesh /

KURNOOL MADDILETI NARASIMHA SWAMY TEMPLE HAS INTERESTING HISTORY IN KURNOOL DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN KNL NJ

Kurnool news: భార్యపై అలిగిన దేవుడు భూమ్మీదకు ఎలా వచ్చాడు..? ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆలయ చరిత్ర..!

మద్దిలేటి

మద్దిలేటి నరసింహస్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో ప్రముఖ ప్రాచీన ఆలయాలున్నాయి. వందల, వేల ఏళ్ల చరిత్రగలికిన ఆలయాలను సందర్శించినప్పుడు ఏదో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. కొన్ని ఆలయాలు అనాటి ప్రాచీన శిల్పకళను, ఇంజనీరింగ్ అద్భుతాలను కళ్లకు కడుతుంది.

ఇంకా చదవండి ...
    Murali Krishna, News18, Kurnool

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో ప్రముఖ ప్రాచీన ఆలయాలున్నాయి. వందల, వేల ఏళ్ల చరిత్రగలికిన ఆలయాలను సందర్శించినప్పుడు ఏదో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. కొన్ని ఆలయాలు అనాటి ప్రాచీన శిల్పకళను, ఇంజనీరింగ్ అద్భుతాలను కళ్లకు కడుతుంది. అందులోకే వస్తుంది కర్నూలు జిల్లా (Kurnool District) బేతంచెర్ల మండలంలోని రంగపురం గ్రామానికి 6 కి.మీ. దూరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. కొండ, కోనలు.. చుట్టూ ప్రకృతి ప్రశాంత వాతావరణంలో ఆ దేవాలయం ఆహ్లాదంగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఐతే అన్ని ఆలయాల మాదిరిగానే ఈ నారసింహ క్షేత్రానికి ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. సామాన్యుల మాదిరిగానే దేవడు కూడా భార్యపై అలుగుతాడా..? అనే సందేహం ఈ ఆలయ చరిత్ర వింటే తప్పకుండా కలుగుతుంది.

    భార్యపై అలిగి భూమిపైకి వచ్చిన నరసింహ స్వామి
    శ్రీ లక్ష్మీనరసింహస్వామి , లక్ష్మీదేవితో పాచికల ఆట అడుతుండగా... ఈ ఆటలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఓడిపోతాడు. స్వామి ఓడిపోయినందుకు లక్ష్మీదేవి పరిహాసంగా నవ్వడం జరుగుతుంది. దీనితో లక్ష్మీనరసింహస్వామి అలిగి యాగంటి క్షేత్రం అయిన ఎర్రమల ప్రదేశంకి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. యాగంటి క్షేత్రంలో కొలువు తీరిన శివయ్య నరసింహస్వామిని ఏం జరిగింది అని అడగగా, నరసింహస్వామి నేను ఇక్కడ కొన్ని రోజుల ఉండాలనుకుంటున్న అని చెబుతారు. అందుకోసం శివయ్య లక్ష్మినరసింహస్వామికి పక్కనే మద్దులేరు అనే ఏరు ప్రవహిస్తూ ప్రకృతి అందాలతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది అక్కడికి వెళ్ళు అని చెప్పినట్లు ప్రతీతి.

    ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్.., టీటీడీ కీలక ప్రకటన..


    అప్పుడే తొలిసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొండమీద పాదం మోపారు. పాదం మోపిన స్థలం నుండి కొద్దిగా ముందు గరుడద్వీపం 70మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ గరుడద్వీపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఇక్కడి వారి నమ్మకం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి మొదట పాదం మోపిన స్థలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదముద్ర ఇప్పటికీ అలాగే ఉంది అక్కడ నిత్యం పూజలు జరుగుతాయి.

    ఇది చదవండి: రూపాయికి పది రూపాయల లాభం.. బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ ఐడియా అదిరిపోలా..!


    శ్రీ మద్దిలేటీస్వామి పాదం..
    లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ పాదం మోపిన తర్వాత ఉడుము రూపంలోకి మారడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉడుము అవతారంలో మద్దిలేరు చుట్టూ సంచరిస్తూ ఉండేవాడు. మద్దిలేరుకు మూడు కి.మీ దూరంలోని మోక్ష పట్టణాన్ని కన్నప్పదొర అనే రాజు పరిపాలిస్తుండేవారు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు. ఓరోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తళతళ మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాలంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు. అది పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు. అదేరోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనబడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని..ఇప్పుడు అక్కడే ఓ పుట్టలో ఉన్నానని చెబుతాడు. కన్నప్ప దొర నిద్ర నుండి మేల్కొని ఆ పుట్టని త్రవ్వి చూడగా దీర్ఘచతురస్రాకారంలో ఒక శిలా రూపంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ విగ్రహాన్నే ప్రతిష్టించి పూజలు చేశారు. ఆ విగ్రహాన్నే ప్రస్తుతం మనం నిత్యం పూజలు చేస్తున్నాం.

    ఇది చదవండి: బాబోయ్ బెజవాడ..! అటువైపు వెళ్లాలంటేనే హడల్.. కారణం ఇదే..!


    స్వామిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవి
    ఇక్కడికి అలిగి వచ్చిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వెతుక్కుంటూ గరుత్మంతునిపైన లక్ష్మీదేవి వస్తుంది. గరుత్మంతునితో లక్ష్మీదేవీ అడుగుపెట్టినచోట ప్రస్తుతం గరుడ స్థంభం ఉంది. లక్ష్మీదేవి ఇక్కడ చెంచులక్ష్మీ అమ్మవారికిగా జంతుబలులను స్వీకరిస్తూ ఇక్కడే ఉండిపోయారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి శనివారం రోజు ఇక్కడ పాదం పెట్టడం వలన , భక్తులుశుక్రవారం మరియు శనివారం ఎక్కువగా వస్తారు.

    ఇది చదవండి: ఆనియన్ దోశ తిన్నాం.. కానీ ఐస్ క్రీమ్, చాక్లెట్ దోశ తిన్నారా..? తింటే వదిలిపెట్టరు బాస్..


    మద్దులేరు ప్రత్యేకత
    ఈ ఆలయానికి పక్కగా మద్దులేరు అనే ఏరు ప్రవహిస్తుండటం వలన ఈ ఆలయానికి శ్రీ మద్దిలేటీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అని పేరు రావడం జరిగింది. ఈ మద్దులేరు ఎల్లప్పుడు జీవనదిగా ఉంటుంది. ఎలాంటి కాలంలో అయిన ఎండిపోకుండా సజీవంగా ప్రవహిస్తూ ఉంటుంది.

    ఇది చదవండి: ఈ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ అవసరం లేదు.. ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు..


    ప్రతి శుక్ర, శని వారాల్లో ప్రత్యేక పూజలు
    ప్రతి శుక్ర, శనివారాల్లో జరిగే పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. భక్తులు తాము అనుకున్న కోర్కెలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. జిల్లాలో స్వామివారి పేరుతో మద్దయ్య, మధు, మధుకిరణ్‌, మద్దిలేటి, మద్దిలేటమ్మ, మద్దమ్మ, మంజుల, మధనేశ్వరి, మయూరి ఇలా రకరకాలుగా పేర్లు పెటుకొని తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.

    ఇది చదవండి: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!


    ఉత్సవాలు..
    ఈ క్షేత్రంలో 2008 నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం అశేషభక్తుల మధ్య జరుగుతుంది. మూడురోజులపాటు పలు ఉత్సవాలు, క్రీడలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది. దాతల సహకారంతో నిర్మించిన 150 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి.

    ఇది చదవండి: క్యాట్ వాక్ గురించి తెలుసు.. మరి బర్డ్ వాక్ అంటే ఎంటో తెలుసా..?


    ఎలా వెళ్లాలి..?
    శ్రీ మద్దిలేటీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల మండలంలోని రంగపురం గ్రామానికి 6 కి.మీ. దూరంలో ఉంది. కర్నూలుకు 65 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. బేతంచెర్ల, డోన్‌ నుంచి ఆర్‌ఎస్‌ రంగాపురం వరకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. నంద్యాల, డోన్‌ రైలు మార్గంలో రంగాపురం స్టేషన్‌లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు