హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: మేముసైతం అంటున్న కలెక్టర్ల సతీమణులు..! ఏం చేశారో చూస్తే షాక్ అవుతారు

Kurnool: మేముసైతం అంటున్న కలెక్టర్ల సతీమణులు..! ఏం చేశారో చూస్తే షాక్ అవుతారు

X
కలెక్టర్ల

కలెక్టర్ల భార్యలు ఏం చేస్తున్నారో చూడండి

Kurnool: తాము సైతం అంటున్నారు ఐఏఎస్ అధికారుల సతీమణులు. ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ కళాశాల, జగన్నాథ గట్టుపై కర్నూలు జిల్లా ఐఏఎస్‌ల సతీమణులు మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

T. Murali Krishna, News18, Kurnool

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో భాగంగా మేము సైతం అంటూ ఐఏఎస్ అధికారుల సతీమణులు కర్నూలు (Kurnool) లోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు (Plantation). ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ (IAS Officer Association ) ఆధ్వర్యంలో కర్నూలు వైద్య కళాశాల, సిల్వర్ జూబ్లీ కళాశాల, జగన్నాథ గట్టుపై కర్నూలు జిల్లా ఐఏఎస్, ఉన్నతాధికారుల, ప్రజాప్రతినిధుల సతీమణులు మొక్కలు నాటారు. సంగమేశ్వర ప్రాంతంలో దాదాపు రెండు వేల మొక్కలు నాటారు. పర్యవరణాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా కలెక్టర్ భార్య స్వర్ణలత తెలిపారు. కేవలం మొక్కలు నాటడం ఒక్కటే కాదు వాటికి ప్రతి రోజు మీరు పోసి పరిరక్షించినప్పుడు మన సంకల్పం నెరవేరుతుందని స్వర్ణలత తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌లో భాగంగా ఇలా మొక్కలు నాటే కార్యక్రమంలో తాము కూడా భాగస్వాముల అయినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున ఒక మొక్కను నాటి ప్రతిరోజు వాటికి నీళ్లు పోసి పెంచాలన్నారు. మారుతున్న నేటి కాలంలో పంట పొలాలను చెట్లను నరికేసి వాటి స్థానంలో బిల్డింగ్స్, కంపెనీలు, హోటళ్లు వంటివి ఏర్పాటు చేయడంతో… పచ్చగా ఉండాల్సిన ప్రదేశాలన్నీ ఎడారిలా మారిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయని స్వర్ణలత తెలిపారు. ఇలాగైతే రాబోయే తరంలో కృత్రిమ ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి సతీమణి ఉమామహేశ్వరమ్మ, కోడలు రూపశ్రీ, కర్నూలు ఎమ్మెల్యే తల్లి మున్వర్‌ఖాన్‌ తదితరులు కూడా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాకడం అలవాటు చేసుకోవాలన్నారు. పెద్దలు పిల్లలకు చిన్నతనం నుంచి మొక్కలు నాటడం అలవాటు చేయాలని ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

మైనారిటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్ సతిమణి సమీన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణానికి ప్రమాదం కలిగించే ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేదించాలని ఆమె కోరారు. ప్రకృతి అనేది మనుషులకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరమని దాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని సమీన తెలిపారు. మైనారిటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్ సతిమణి శాలువాలతో తయారు చేసిన బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌ను వాడకుడదన్న ఉద్దేశంతో శాలవలతో బ్యాగులను తయారు చేశామని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి : నగర వాసులను భయపెడుతున్న కొత్త గ్యాంగ్.. హైపర్‌ పేరుతో సెటిల్‌మెంట్‌లు, దందాలు..! ఏం జరుగుతోంది?

మొక్కలు నాటడం వలన సకాలంలో వర్షాలు కురిసి పంటతో పండించే రైతులకు కూడా చాలా మేలు జరుగుతుందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను డ్వామా సిబ్బంది సత్కరించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News

ఉత్తమ కథలు