హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: సిల్వర్ జూబ్లీ కాలేజీలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌..! ఎంతో ప్రత్యేకత ఉంది తెలుసా?

Kurnool: సిల్వర్ జూబ్లీ కాలేజీలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌..! ఎంతో ప్రత్యేకత ఉంది తెలుసా?

సిల్వర్

సిల్వర్ జూబ్లీ కాలేజ్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు

Kurnool: రాష్ట్రంలోని అనేకమంది ఐఏఎస్ లతో పాటు విద్యార్థులను ఉన్నత విద్యవంతులుగా తీర్చిదిద్దిన ఏకైక కళాశాల కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల. ఈ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ కాలేజ్ కు చాలా ప్రత్యేకత ఉంది తెలుసా?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో గుర్తింపు పొందిన కాలేజ్ (College) లు ఉన్నాయి. వాటిలో కొన్నిటి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మహా మహులను అందించిన కళాశాలలుగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో ఒకటి ఇది.. రాష్ట్రంలోని అనేకమంది ఐఏఎస్ (IAS) లతో పాటు విద్యార్థులను ఉన్నత విద్యవంతులుగా తీర్చిదిద్దిన ఏకైక కళాశాల కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల (Silver Jublee College). ఈ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఇంటర్ స్టేట్ గవర్నమెంట్ అటానమస్‌ కాలేజ్ గేమ్స్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌-2022 లో భాగంగా వాలీబాల్ (Volleyball) , కబడ్డీ (Kabadi) ,చెస్ (Chess) ,బ్యాడ్మింటన్ (Badminton), అథ్లెటిక్స్ (Athletics) క్రీడా పోటీలు జరిగాయి.

  ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ వివి సుబ్రహ్మణ్య కుమార్ మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వివిధ గవర్నమెంట్ డిగ్రీ విద్యార్థులు జట్లుగా వచ్చాయన్నారు.

  ఈ క్రీడా పోటిల్లో విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలను అందజేశారు. కబడీ పోటీల్లో ప్రధమ స్థానంలో ఖమ్మంలోని SRBGNR డిగ్రీ కళాశాల నిలవగా… ద్వితీయ స్థానంలో అనంతపురం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నిలిచంది. కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల మూడో స్థానంలో నిలిచింది.

  ఇదీ చదవండి : శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు.. ఈ రోజు దర్శించుకుంటే పుణ్యఫలం ఏంటో తెలుసా?

  వాలి బాల్ పోటీలో విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ టీమ్‌ ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం SRBGNR డిగ్రీ కళాశాల టీమ్‌ ద్వితీయ స్థానంలో నిలవగా, తృతీయ స్థానంలో కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల నిలిచింది.

  ఇదీ చదవండి : ఇంట్లో ఉంటూనే ఆదాయం.. ఆరోగ్యం కోసం ఇలా చేయండి..

  బ్యాడ్మింటన్ పోటీలో మొదటి స్థానంలో ఖమ్మం SRBGNR డిగ్రీ కళాశాల, రెండో స్థానంలో కడప ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మూడో స్థానంలో కాకినాడ పి.ఆర్ డిగ్రీ కళాశాల నిలిచాయి. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ కళ్యాణ్‌కు కళాశాల ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక అతిధులుగా ఇండియన్ కబడ్డీ ప్లేయర్ విశ్వనాధ్ చౌదరి, ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ నరేష్, ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ కృష్ణంరాజు హాజరయ్యారని అన్నారు.

  ఇదీ చదవండి : సింహ వాహనంపై యోగ నరిసింహుడు.. ముత్యపు పందిరిలో కళా నీరాజనం.. స్వామి దర్శనంతో భక్తులకు తన్మయత్వం..

  వివిధ ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు బహుమతులుగా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కమిషనర్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ భూపాల్ ,ఆర్గనైజింగ్ చైర్మన్ వీవీఎస్ కుమార్ ,ఎస్ జె జిసి ప్రెటర్నిటీ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డి ,జనరల్ సెక్రెటరీ మరియు స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జీవన్ కిరణ్ ,ఆర్చరీ కోచ్ వంశీకృష్ణ ,ఆయా కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News

  ఉత్తమ కథలు