హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: చిరుతను సైతం పరిగెత్తించగల సత్తా ఆ కుక్కలది..! అందుకే అక్కడ దొంగల భయం లేదు.. ఫారెన్‌లో ఫుల్‌ డిమాండ్‌..!

Kurnool: చిరుతను సైతం పరిగెత్తించగల సత్తా ఆ కుక్కలది..! అందుకే అక్కడ దొంగల భయం లేదు.. ఫారెన్‌లో ఫుల్‌ డిమాండ్‌..!

X
ఈ

ఈ కుక్కలకు ఫారిన్ లో ఫుల్ డిమాండ్

Kurnool: ఆ ఊర్లో కుక్కలు చాలా ప్రత్యేకమైనవి.. చిరుతను సైతం పరుగులు పెట్టిస్తాయి.. వన్యమృగాలనైనా వణికించగలవు.. ఆ కుక్కల దాటికి ఏ జాతి అడవి జంతువైనా బలాదూరే.! ఇప్పటి వరకు ఆ ఊరిలో దొంగలు కూడా పడలేదంటే కేవలం ఆ కుక్కల వల్లే అంటే నమ్ముతారా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool.

ఆ ఊరిలో ఇప్పటి వరకు దొంగలు పడలేదు.. పడే అవకాశం కూడా లేదు.. అందుకు కారణం ఆ ఊరి కుక్కలే అంట.. నమ్మాలి అనిపించడం లేదా.. కానీ అది నిజం ఎందుకంటే ఆ ఊర్లో కుక్కలు (Street Dogs) చిరుత (Cheetah)ను సైతం పరుగులు పెట్టిస్తాయి.. వన్యమృగాలనైనా వణికించగలవు.. ఆ కుక్కల దాటికి ఏ జాతి అడవి జంతువైనా (Wild Animals) బలాదూరే..! అందుకే ఇప్పటి వరకు ఆ ఊరిలో దొంగలు కూడా పడలేదు అంటున్నారు గ్రామస్తులు. ఇంతకీ ఏ ఊరు అది..! ఆ కుక్కల స్పెషాలిటీ ఏంటి..? తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

ఆ ఊరి పేరు పందికోన..  కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ మండలంలో పత్తికొండకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామ జనాభా 7000 పైనే ఉంటుంది. ఈ గ్రామానికి చుట్టూ పెద్ద అడవి. అందుకే గతంలో గ్రామంలోకి చిరుతలు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు వచ్చి దాడులు చేసేవి. వాటి బారినుంచి రక్షణ కోసం గ్రామస్తులు కుక్కల సాయం తీసుకునేవారు. ఆ గ్రామంలోని కుక్కలు ఎటువంటి భయం లేకుండా క్రూర మృగాలు కనబడితే వెంటాడేవట.

ఇంతకీ అక్కడి కుక్కలకు అంత ధైర్యం ఎందుకు అంటే?                  ఓ సారి చిరుత, ఆడ కుక్క మధ్య సంపర్కం ద్వారా పిల్లలు పుట్టాయని, ఆ పిల్లలే నేటి పందికోన కుక్కల జాతి అన్నది ఆ గ్రామ ప్రజలు చెబుతున్న మాట. చిరుతకు ఉండే పౌరుషం, సాహసం, కుక్కకు ఉండే విశ్వాసం కలగలిపి ప్రస్తుతం పందికోన జాతి కుక్కలకు ఉన్నాయనేది స్థానికుల అభిప్రాయం. అలాగని వీటికి ప్రత్యేక ఆహారం అవసరం లేదట సాధారణంగానే మనుషులు తినే ఆహారంలాగే వీటికి పెడుతుంటారు.

ఇదీ చదవండి : రోడ్డుపై చెత్త ఊడుస్తున్న సర్పంచ్‌..! ఎందుకిలా చేస్తోందా తెలుసా?

ఏవైనా వన్య మృగాలు గ్రామంలోకి అడుగు పెడితే ఈ ఊరి కుక్కలు చీల్చి చెండాడుతాయి. ఆ కుక్కలు ఉండటం వల్ల ఆ గ్రామంలో ఇప్పటివరకు దొంగతనం కూడా జరగలేదు అని గ్రామస్తులు చెబుతున్నారు. అంతకుముందు చిరుతలు, నక్కలు వచ్చి గొర్రె పిల్లలను, పశువులను ఎత్తుకెళ్లి చంపేవట. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఒక్కొక్క గొర్రెల కాపరి కనీసం 5 నుంచి 10 కుక్కలను పెంచుకుంటున్నారు.

ఇదీ చదవండి: మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన ?

విదేశాల్లోనూ మంచి డిమాండ్‌..!

పందికోన కుక్కలకు గోర్లు, కళ్ళు, చెవులు ఇతరత్రా చిరుతలను పోలీ ఉండటం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి. ఈ పందికోన కుక్కల సామర్థ్యం గురించి దేశం నలుమూలల ప్రచారం జరిగింది. ముందుగా జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలువురు పోలీస్ అధికారులు తమ ఇళ్లలో ఈ కుక్కలను పెంచుకుంటున్నారు.

ఇదీ చదవండి : ఈ వింత విన్నారా..? చేపలు ఎండబెట్టేందుకు కూడా మిషన్..!

అమెరికాలో సహా విదేశాలలో ఉన్న తెలుగు వారు అనేకమంది ఇక్కడి కుక్కలను తీసుకెళ్లి పెంచుకుంటుంటారని ఇక్కడి గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ఈ శునకాలకు డిమాండ్ కూడా పెరిగింది. అంతేకాదు అమెరికాలో కుక్కలకు పరుగుపందెం నిర్వహించినప్పుడు పందికోన కుక్క గోల్డ్ మెడల్ సాధించిందట.

ఇదీ చదవండి : ఆ గార్డెన్స్ లో దొరకని మొబైల్ ఉండదు.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే?

కర్నూలు జిల్లాలో పని చేసిన ఎస్పీలు, కలెక్టర్లు బదిలీలపై వెళ్లిన చాలామంది అధికారులు ఇక్కడి కుక్కలను తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. నేర పరిశోధన విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక పందికోన కుక్కలు సాయం చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాదులోనే పందికోన జాతి కుక్కలు వందకు పైగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

అడ్రస్‌: పందికొన గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌-518380

First published:

Tags: Andhra Pradesh, AP News, Dog, Kurnool, Local News

ఉత్తమ కథలు