(T.Murali Krishna,News18,Kurnool)
ఉమ్మడి కర్నూలు (Kurnool)జిల్లా వ్యాప్తంగా అక్రమార్కులు చెలరేగి పోతున్నారు.పత్తికొండ (Pattikonda)నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధితో ఒప్పందం కుదరడంతో పట్టపగలేతవ్వకాలు ప్రారంభించారు. ప్రైవేటు భూములతోపాటు ప్రభుత్వ భూముల్లోనూ దర్జాగా కొండను పిండి మట్టిని తోడేస్తున్నారు. డోన్ పట్టణం వెల్దుర్తి (Veldurthi)మండలంలో గత కొన్ని రోజులుగా సాగుతున్న దందా..పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి, రామళ్లకోట(Ramallakota)తదితర ప్రాంతాల పరిధిలో అనేక ఇనుప ఖనిజ (Iron ore)నిల్వలున్నాయి. అక్రమార్కులు రామళ్లకోట ప్రాంతంలో సర్వే నంబరు 764లో గతేడాది భారీగా తవ్వకాలు చేపట్టారు. దానికి గాను అంధుకు సంబందించిన భూ యజమానికి కొంత నగదు ఇస్తూ అధికార పార్టీ నేతలకు కొన్ని మామూళ్లు ఇస్తూ యథేచ్చగాతవ్వకాలు సాగిస్తున్నారు.
భూ మాయగాళ్లు..
ఆ ప్రాంతంలో గ్రేడ్ -62 ఇనుప ఖనిజం ఉండటంతో కొండను పిండిచేస్తున్నారు. ఖనిజానికిమార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఆ నేత కన్ను వెల్దుర్తి , బనగానపల్లె తదితర ప్రాంతాలపై పడింది. మామూళ్లు వద్దు.. తానే ఆ ఖనిజాన్ని తవ్వుకుంటామని ఆ నేత హుకుం జారీ చేశారు. దీంతో ఇద్దరి మధ్య తేడాలు రావడంతో తవ్వకాలు నిలిచిపోయాయి.
ఇలాంటి అక్రమాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ..
డోన్ పట్టణం పరిధిలో 2021-22 సంవత్సరం అటవీ సంపదను అధికార పార్టీ నేతలు అక్రమంగా తరలిస్తున్న పలు వాహనాలతోపాటు, తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు దాదాపు రూ.2.04 లక్షల విలువైన కనిజా సంపదను గుర్తించారు. తవ్వకాలు చేపట్టిన వారికి నామమాత్రంగా రూ 6 లక్షల వరకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఓ టిప్పర్ను స్వాధీనం చేసుకుని రూ.1.05 లక్షల జరిమానా విధించిన్నట్లు తెలిపారు.
ఖనిజం కోసం తవ్వకాలు..
అదే విదంగా నాలుగు ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగా, మూడు ట్రాక్టర్లలో ఐరన్ ఖనిజం మరియు రఫ్ స్టోన్ మొజాయిక్ చిప్స్ వంటివి తరలిస్తునట్లు అధికారులు గుర్తించారు. వీటికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఇలా అనేక మార్లు పట్టుబడిన కొండలు తవ్వే రాబందులలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనర్హం.ఇకనైనా అధికారులు ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుని కరిగే కొండలు ఆడవి సంపదను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Kurnool, Local News