హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నాడు-నేడుతో ఆ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.. చూస్తే వారెవా అనాల్సిందే..!

నాడు-నేడుతో ఆ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.. చూస్తే వారెవా అనాల్సిందే..!

నాడు-నేడుతో

నాడు-నేడుతో అభివృద్ధి చెందిన పాఠశాల

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు కొత్తరూపురేఖలు తీసుకొస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లన్నిటిని అభివృద్ధి చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు కొత్తరూపురేఖలు తీసుకొస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లన్నిటిని అభివృద్ధి చేస్తున్నారు. అలా అభివృద్ధి చెందిన స్కూలే కర్నూలు (Kurnool) నగర శివార్లలోని మిలటరీ కాలనీలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. గతంలో అక్కడ కొంత మంది విద్యార్థులతో మాత్రమే అరకొర వసతులలోనే విద్యాబోధనలు జరిగేవి. ఉపాధ్యాయులు మంచిగా బోధన చేసినా కానీ విద్యార్థి, విద్యార్థినిలకు సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ఆ పాఠశాలకు వెళ్ళలేక... సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి కర్నూలుకు వెళ్లి చదువుకొనేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమంతో కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలు నూతన ఒరవడిని సంతరించుకున్నాయి.

  కర్నూలుకు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో మిలటరీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంటుంది. గతంలో ఈ పాఠశాల కొండ ప్రాంతంలో ఉండడంతో స్కూల్‌ప్లే గ్రౌండ్ అంతా కూడా ఎగుడు దిగుడుగా ఉండేది. స్కూల్ ఆవరణలో విద్యార్థిని, విద్యార్థులకు టాయిలెట్‌లు లేక ఏ ముళ్లపొదల్లోకి వెళ్లే వారు.., కనీసం ఉపాధ్యాయులకు కూడా టాయిలెట్స్ ఉండేవి కాదు.

  ఇది చదవండి: కాదేదీ కళకు అనర్హం అన్నట్లు..గుడ్డుపైనే అద్భుత కళాకండాలు..!అబ్బురపరుస్తున్న విశాఖ కళాకారుడు..!

  కానీ నాడు- నేడుతో మిలిటరీ కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మనబడి నాడు-నేడు కింద కేటాయించిన రూ.39 లక్షల నిధులతో పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. టాయిలెట్స్, గ్రీన్ బోర్డ్స్, ప్లే గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇలా విద్యార్థులు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఆహ్లాదకర వాతావరణం లో నేడు అక్కడ విద్యా బోధనలు జరుగుతున్నాయి.

  లక్ష పెట్టుబడితో ఇంటి నుంచే అధిక లాభార్జన.. ఇంతకీ ఆ యువకులు ఏంచేస్తున్నారంటే..!

  ఈ నేపథ్యంలోనే మిలిటరీ కాలనీ చుట్టూపక్కల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్ మానివేసి అదే కాలనీలో ఉన్న ప్రభుత్వం పాఠశాలలో చేరారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు ప్రతి సంవత్సరం 50 శాతం విద్యార్థుల డ్రాప్స్ ఔట్స్ ఉండేవని.., కానీ నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు సంబంధించి చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల వలన విద్యార్థుల డ్రాప్స్ ఔట్స్ 50% నుండి ఒక శాతంకి తగ్గిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.

  ఇది చదవండి: పాయా దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇక్కడ దొరికే దోశ ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే..!

  మిలటరీ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాలుగు సంవత్సరాల నుంచి కూడా తెలుగు పాఠాలను భోదిస్తున్న ఉపాధ్యాయుడు రాఘవయ్య అంధుడు. అయితేనేం విద్యార్థులకు ప్రత్యేకమైన అంధుల లిపి ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. తాను పుట్టినప్పటినుంచి కూడా పూర్తిగా 2 కళ్ళు లేవని అయినా ఆత్మస్థైర్యంతో డీఎస్సీలో ఉత్తీర్ణుడై.., ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్నానని రాఘవయ్య మాస్టారు చెబుతున్నారు.

  ఇలా విద్యార్థులకు పాఠాలు బోధించడం తనకు ఆనందంగా ఉందంటున్నారు రాఘవయ్య మాస్టారు. లక్షల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కావలసినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయడంతో ఇంటికంటే స్కూలే బాగుందంటున్నారు విద్యార్థులు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇలా చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Schools, Kurnool, Local News

  ఉత్తమ కథలు