హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ''సీపీఎస్‌ రద్దుపై తగ్గేదేలే''.. మోకాళ్లపై కూర్చుని ఉపాధ్యాయుల ఆందోళన

Kurnool: ''సీపీఎస్‌ రద్దుపై తగ్గేదేలే''.. మోకాళ్లపై కూర్చుని ఉపాధ్యాయుల ఆందోళన

X
టీచర్ల

టీచర్ల ఆందోళన

ఉద్యోగులు, టీచర్లు రోజు రోజుకు ఆందోళనలు ఉధృతం చేస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు CPS రద్దు చేసి OPS అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో విద్రోహ దినంగా ఉద్యోగులు పాటిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Kurnool

ఉద్యోగులు, టీచర్లు రోజు రోజుకు ఆందోళనలు (Teachers Protest) ఉధృతం చేస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు CPS రద్దు చేసి OPS అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో విద్రోహ దినంగా ఉద్యోగులు పాటిస్తున్నారు. సీపీఎస్ రద్దు ( CPS Repeal protests) కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కేవలం ఉద్యోగుల భద్రత దృష్ట్యా కార్యక్రమాలను నిలిపివేశామన్నారు.

రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం నెలకొన్న విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో విజయవాడ (Chalo Vijayawada) కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వడంతో ఉద్యోగులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

Janhvi kapoor: తిరుమలలో శ్రీదేవి కూతురు సందడి.. అచ్చ తెలుగు ఆడపడచులా జాన్వీ కపూర్

ఈ నేపథ్యంలోనే కర్నూలులోని ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి కర్నూలులో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నారు. మోకాళ్లపై కూర్చుని సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అప్పటి ప్రతిపక్షనేత ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అలా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా… దాన్ని ప్రశ్నించినందుకు ఉపాధ్యాయుల మీదనే అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు.

పోలీసులు నోటీసులో ఇవ్వడం వల్లనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో నాగన్న(52) అనే ఉపాధ్యాయుడు తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.


సీపీఎస్‌ (CPS) ను రద్దు చేసి, పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం సీఎం ఇల్లు ముట్టడికి పిలుపునివ్వడంతో దీన్ని భగ్నం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరిని ముందస్తుగా అరెస్టులు చేశారు. మూడు రోజులు తమ అదుపులోనే ఉంచుకుంటామని హెచ్చరించారు. బైండోవర్‌ చేసి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు పూచీకత్తు బాండ్లు రాయించుకున్నారు.

ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పలు జిల్లాల నుంచి టీచర్లు, ఉద్యోగులు వస్తుండటంతో ఆయా జిల్లాల సరిహద్దులోనూ ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సీపీఎస్ అంశంపై కసరత్తును ప్రారంభించింది. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ విధానాన్ని అమలుచేసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులను శాంతపరుస్తుందో లేదో వేచి చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News

ఉత్తమ కథలు