KURNOOL KURNOOL ROCK GARDEN HAS HISTORY AND NATURAL BEAUTY AS IT BECOME FAVORITE SHOOTING SPOT FOR TOLLYWOOD FULL DETAILS HERE PRN KNL VJ
Rock Garden: టక్కరి దొంగ నుంచి బాహుబలి వరకు అదే ఫేవరెట్ షూటింగ్ స్పాట్.. ఎక్కడుందో తెలుసా..?
కర్నూలు రాక్ గార్డెన్స్
భారతీయ పురాణ, ఇతిహాసాల్లోనే కాకుండా చరిత్రతో పాటు ప్రస్తుత రాజకీయ పరంగానూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాయలసీమ అత్యంత ముఖ్యమైన ప్రాంతం. రాయలసీమలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు (Kurnool) కు కొంత ప్రాముఖ్యం ఎక్కువే.
భారతీయ పురాణ, ఇతిహాసాల్లోనే కాకుండా చరిత్రతో పాటు ప్రస్తుత రాజకీయ పరంగానూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాయలసీమ అత్యంత ముఖ్యమైన ప్రాంతం. రాయలసీమలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు (Kurnool) కు కొంత ప్రాముఖ్యం ఎక్కువే. చారిత్రాత్మకంగానే కాకుండా భౌగోళికంగా కూడా ఈ జిల్లా విభిన్నమైనదే. కర్నూలులోనే చుట్టు పక్కల మనకు అనేక ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్ సమయంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు వీకెండ్ తో పాటు సాధారణ పర్యాటకానికి కూడా అనువైన పర్యాటక ప్రాంతాలలో ఒకటి ఓర్వకల్లు రాతి ఉద్యానవనం (Rock garden).
షూటింగ్స్ కి కేరాఫ్ అడ్రస్
ఓర్వకల్ ఒక పర్యాటక ప్రాంతమే కాకుండా ప్రముఖ సినిమా షూటింగ్ ప్రదేశం కూడా.. ఈ ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో జయం మనదేరా, టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి (Bahubali) వంటి ఎన్నో చిత్రాలను చిత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తోంది. పిల్లల విజ్ఞాన యాత్రలకు, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్లకు సూపర్ స్పాట్.
ఈ రాక్ గార్డెన్ కర్నూలు జిల్లా, ఓర్వకల్లు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సహజంగా ఏర్పడిండి. ఓర్వకల్లు జిల్లా కేంద్రమయిన కర్నూలు నుండి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే జాతీయ రహదారి 18 కి ఆనుకుని ఈ రాతినిర్మాణం ఏర్పడింది.
ఓర్వకల్ రాక్ గార్డెన్ జాతీయరహదారిని అనుకోని సులభంగా చేరుకొనే విధంగా ఉంటుంది. ఓర్వకల్ మండలానికి వెలుప ఉన్న ఈ రాక్ గార్డెన్ లో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం మరియు పిక్నిక్ స్థలాలు, వసతి కై హరితా రిసార్ట్ ఉన్నాయి. గాజుపరిశ్రమలో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా వంటి ముడిపదార్ధాలతో ఇక్కడి రాతి శిలలు ఏర్పడ్డాయి. ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినవే..!
చూడాల్సిన మరోమంచి ప్రదేశం
ఓర్వకల్ రాక్ గార్డెన్ లో చూడవలసిన మరో స్థలం డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్. ఇక్కడ నిలబడి పక్షుల శబ్దాలను, కిలకిలారావాలు, విహారాలు గమనించవచ్చు. లోయలు, కొండలు, నీటి ప్రవాహాలు, అబ్బురపరిచే రాతి దృశ్యాలు, అవి ఏర్పడ్డ తీరు ఇవన్నీ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.
కట్టిపడేసే కేతవరం కొండలు
పర్యాటకులను అబ్బురపరిచే కేతవరం కొండలు పదివేల ఏళ్లనాటి ఆదిమానవుని లిపి, బొమ్మలు, చిహ్నాలు ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామం కొండలపై కనిపిస్తాయి. క్రీస్తుకుపూర్వం 8 వేల ఏళ్లకింద ఇక్కడ ఆదిమానవులు సంచారం చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆదిమానవుని జీవిత విశేషాలు, ఆచార వ్యవహారాలు, లిపివర్ణ చిత్రాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్లే దారిలో పూడిచెర్ల మీదుగా కేతవరం వెళ్లవచ్చు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తున్నారు.
ఓర్వకల్ ఎలా వెళ్లాలి..?
కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. స్టేషన్ నుంచి ఆటో ఎక్కి బస్టాండ్‌కు వెళితే..అక్కడ నంద్యాల , బనగానపల్లె వెళ్లే బస్సులు ఎక్కితే ఓర్వకల్ చేరుకోవచ్చు. నంద్యాల రైల్వేస్టేషన్ నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ నుంచి కూడా ఓర్వకల్ వెళ్లొచ్చు. బస్సు ద్వారా అయితే కర్నూలు నుంచి ఓర్వకల్‌కు తరచూ అరగంటకోసారి బస్సు ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.