హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Traffic Challans: చలానాల మోత

Traffic Challans: చలానాల మోత

కొరడా ఝుళిపిస్తున్న ట్రాఫిక్ అధికారులు

కొరడా ఝుళిపిస్తున్న ట్రాఫిక్ అధికారులు

Kurnool: రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

T. Murali Krishna, News18, Kurnool

రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు తెలిపారు. నవంబర్ 13 నుండి 19 వ తేది వరకుజిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను విడుదల చేశారు .

ఇందులో ప్రధానంగా

• వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై 289 కేసులు.

• హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 1,489 కేసులు, మైనర్ల పై 54 కేసులు.

• ఒన్ వే లో రాంగ్ రూట్ వెళ్ళిన వారిపై 75 కేసులు.

మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై 138 కేసులు.

• ఏలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 1,989 కేసులు.

• సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు , జీపులు , తదితర వాహన చోదకుల పై 59 కేసులు.

• అతి వేగంతో వెళ్లిన వాహనాల పై 563 కేసులు.

• ఓవర్ లోడ్ తో వెళ్ళిన వాహనాల పై మోటారు వాహనాల చట్టం కింద 54 కేసులు.

• త్రిబుల్ రైడింగ్ పై 308 మంది కేసులు.

• రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్రవాహానాల పై 159 కేసులు.

• రాంగ్ పార్కింగ్ చేసిన త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహానాల పై 134 కేసులు.

• నంబర్ ప్లేట్ లేని వాహనాల పై 136 కేసులు.

• మొత్తం 5 లక్షల 50 వేల ఈ – చలనాలు పెండింగ్ లో ఉన్నాయని ఈ వారంలో 8,894 ఈ – చలనాలను (రూ.22 లక్షల 40 వేల 210 రూపాయలను) రికవరీ చేశామన్నారు.

• జిల్లా మొత్తంలో 34 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించామన్నారు.

• ఆటో డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు , “స్టాప్ వాష్ అండ్ గో” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినా , రహదారులపై ఇబ్బందికరంగా వాహనాలు నిలిపినా వెంటనే డయల్ 100 కు సమాచారం చేరవేయాలని జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు