KURNOOL KURNOOL POLICE DESTROYED 21000 LIQUOR BOTTLES WHICH ARE CEASED IN SEB RIDES IN THE DISTRICT FULL DETAILS HERE PRN KNL NJ
Kurnool News: ఈ సీన్ చూస్తే మందుబాబులు గుండెలు బాదుకుంటారు.., అలాగే ఉంటది మరి..!
కర్నూలులో భారీగా అక్రమ మద్యం ధ్వంసం
Illicit Liquor: ఈ సన్నివేశం చూస్తే నిజంగానే మందుబాబుల గుండె గుభేల్‌మంటుంది. నోటికి అందాల్సిన మందు నేల పాలయ్యిందే అని గుండెలు బాదుకుంటారు. ఆ బాధలో ఎంత తాగుతారో వారికే అర్ధంకాదు. అలాఉంటుందా సీన్.
ఈ సన్నివేశం చూస్తే నిజంగానే మందుబాబుల గుండె గుభేల్‌మంటుంది. నోటికి అందాల్సిన మందు నేల పాలయ్యిందే అని గుండెలు బాదుకుంటారు. ఆ బాధలో ఎంత తాగుతారో వారికే అర్ధంకాదు. అలాఉంటుందా సీన్. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అక్రమ మద్యం అరికట్టించేందుకు ప్రభుత్వం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసింది. సెబ్ సాయంతో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. పోలీసుల వరుస దాడులతో భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఈ మద్యాన్ని అందరి ముందే ధ్వంసం చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా (Kurnool District) లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ మొత్తం మద్యంను రోడ్డు రోలర్ (road roller)తో తొక్కించి ధ్వంసం చేశారు పోలీసులు. దాదాపు రెండు కోట్ల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.
1034 కేసుల్లో 22,762 బాటిళ్లు స్వాధీనం
కర్నూలులో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని పోలీసులు ద్వంసం చేశారు. కర్నూలులోని వివిధ పోలీసు స్టేషన్ పరిధిల్లోని 1034 కేసుల్లో 22,762 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని నగర సమీపంలోని ప్రజానగర్ వద్దనున్న మైదానంలో రోడ్డురోలర్‌తో ద్వంసం చేశారు. ద్వంస్వం చేసిన మద్యం (alcohol bottles) విలువ దాదాపు 2 కోట్ల 52 లక్షల 7 వేల రూపాయలు ఉంటుందని డిఎస్పీ మహేష్ తెలిపారు.
వివిధ కేసులలో అక్రమంగా పట్టుబడిన మద్యంబాటిల్స్‌ను స్టేషన్ లో గత కొంత కాలంగా భద్రపరిచారు. జిల్లా ఎస్పీ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పి పర్యవేక్షణలో మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.
వివిధ స్టేషన్స్ లో నమోదైన కేసుల వివరాలు
1. కర్నూలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన 3 కేసులలోని 41 మద్యం సీసాలు. వాటి విలువ రూ .18,890/-
2. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన 38 కేసులలోని 688 మద్యం బాటిళ్లు. వాటి విలువ రూ. 2,38,620 / -
3. కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన 45 కేసులలోని 810 మద్యం బాటిళ్లు. వాటి విలువ రూ. 2,70,210 / -
4. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు చెందిన 948 కేసులలోని 21,223 మద్యం బాటిళ్లు. వాటి విలువ దాదాపు రూ .2 కోట్లు.
మొత్తం 1034 కేసులలోని , 22,762 బాటిల్లు , వాటి మొత్తం విలువ రూ .2,0,52,7,720 / - ( రెండు కోట్ల యాభై రెండు లక్షల ఏడు వేల ఏడువందల ఇరవై రూపాయలు ) విలువ గల మద్యం బాటిళ్లను కర్నూలు జిల్లా S.P. గారి ఉత్తర్వుల మేరకు B. తాండ్రపాడు గ్రామములో , ప్రజా నగర్ కాలనీ ఎదురుగా వున్న మైదాన ప్రాంతములో కర్నూలు D.S.P మహేష్ పర్యవేక్షణలో ధ్వంసం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.