T. Murali Krishna, News18, Kurnool
కర్నూలు జిల్లాలో రెండవ విడతలో భాగంగా సుమారుగా 1047 మొబైల్ ఫోన్లు జిల్లా పోలీస్ యంత్రాంగం రికవరీ చేసింది.వాటి విలువ 2.5 కోట్ల మేరకు ఉంటుంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా సెల్ ఫోన్ పొగోట్టుకున్న బాధితుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయంటున్నారు జిల్లా ఎస్పీ.
తెలంగాణ రాష్ట్రం – వరంగల్ జిల్లా, గుంటూరు , కడప జిల్లాల కూడా వచ్చి మొబైల్ ఫోన్లు పొగొట్టుకున్న బాధితులు వారి మొబైల్ ఫోన్లు పొందారన్నారు.ఇదే వేగంతో ప్రజలకు సేవలందిస్తామన్నారు. కర్నూలు పోలీసు మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ కు మంచి స్పందన కూడా వస్తుందన్నారు.సెల్ ఫోన్లు పోగొట్టుకున్న,చోరి అయిన వాటి పరిష్కారం పై కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా కూడా కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి పొగోట్టుకున్న సెల్ ఫోన్ వివరాలు అందజేస్తే సెల్ పోన్ రికవరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఇటీవల కాలంలో ప్రపంచంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందని, పర్సనల్ సమాచారం, జ్ఞాపకాలు, ఎన్నో మొబైల్ లో ఉంటాయని సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని,జిల్లా ఎస్పీ,కర్నూలు పోలీసులకు సెల్ పోన్లు పొందిన బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇందులో...
1) నాగరాజు (ముడుమాల గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు) – కర్నూలు.
6 నెలల క్రితం కర్నూలు రైతుబజారు నందు మొబైల్ పొగొట్టుకున్నారు. వెల కట్టలేని మొబైల్ పరికరం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
2) శివాని ( యశోద హాస్పిటల్ ) – కర్నూలు.
జనవరిలో మొబైల్ పొగొట్టుకున్నారు.
3) రవికుమార్ - వరంగల్ జిల్లా.- తెలంగాణ రాష్ట్రం.
ఆగష్టు 4 న హైదరాబాద్ బస్సులో వెళుతూ మొబైల్ పొగోట్టుకున్నారు. మొబైల్ తిరిగి నాకు చేరడం ఆనందంగా ఉందని పోలీసుసేవలు అభినందనీయమన్నారు.
4) వెంకటేశ్ – గుంటూరు జిల్లా.
ఏప్రిల్ 24న మొబైల్ పోగోట్టుకున్నారు. గతంలో 564 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినప్పుడు BBC News Channel లో చూసి కర్నూలు పోలీసులకు మొబైల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడంతో 3 వారాల్లోనే మొబైల్ వెతికి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
1) మీ - సేవా నందు ఎలా అప్లై చేయాలి.
బాధితులు తమకు దగ్గర్లోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ క్రింది వివరాలు అందించినట్లయితే మీ మొబైల్ ను పోలీసు వారు తిరిగి ఇప్పించటం కోసం ఈ క్రింది వివరాలను మీరు మీ -సేవా నందు ఇవ్వవలిసి ఉంటుంది.
• మీరు పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ వివరాలు ,
• మీరు పోగొట్టుకున్న మొబైలు/సెల్ ఫోన్ యొక్క IMEI వివరాలు .
• మీరు పోగొట్టుకున్నప్పుడు ఉపయోగించిన మొబైలు నెంబర్ వివరాలు
• మీకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు కార్డ్ , చిరునామా ,పేరు మొదలగు వివరాలు మిమ్మల్ని సంప్రదించడానికి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నెంబర్ మరియు alternate కాంటాక్ట్ వివరాలు ఈ వివరాలు మీరు మీ-సేవా నందు సమర్పించి Missing /lost articles రుసుము ను చెల్లించి , సదరు మీ-సేవా రసీదును తమ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇవ్వవలెను .
లేదా
2) LOST MOBILE TRACKING SERVICE LINK…
kurnoolpolice.in/mobiletheft ఈ లింకు ను క్లిక్ చేసి ఆ వివరాలను సమర్పించండి. మీ మొబైలు ను తిరిగి పొందండి.
ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మొబైల్ LOST కాలమ్ నందు మీ పేరు, మీ జిల్లా , మీ పోలీస్ స్టేషన్ పరిధి ,మీ మొబైలు కు సంబంధించిన IMEI-1, IMEI- 2 వివరాలు, మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ /alternate కాంటాక్ట్ వివరాలు సబ్ మిట్ చేయాలి.ఈ విధంగా మీరు ఫిర్యాదు చేసినచో పోలీస్ వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News