Murali Krishna, News18, Kurnoolఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అక్రమ మద్యం, నాటుసారా మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ అక్రమ మద్యం కనిపించినా, రవాణా చేస్తున్నారని తెలిసినా పోలీసులు వదిలిపెట్టడం లేదు. తాజాగా అక్రమ నాటుసారా, అక్రమ మద్యంపై కర్నూలు జిల్లా (Kurnool District) పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాను మద్యరహిత జిల్లాగా మార్చాలనే సంకల్పంతో ఎస్పీ ఆదేశాల మీద పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత దాడులు చేపట్టారు. అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం, అక్రమ రవాణా, అమ్మకాలపై గత వారం రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం, సెబ్ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా దాడులు చేశారు. నాటుసారా తయారుచేసే 21 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.
ఆగష్టు 30 నుండి సెప్టెంబర్ 06 వరకు జరిపిన దాడులలో పెద్దమొత్తంలో నాటుసారాను పట్టుకున్నారు. అంతేకాదు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు జిల్లా పోలీసులు సమిష్టిగా నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. నాటుసారాపై మొత్తం 13 కేసులు నమోదయ్యాయి.
నాటు సారాలో ఇద్దరిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. అక్రమ మద్యంపై నలుగురిని బైండ్ ఓవర్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నాటుసారా నిర్మూలనకు అనుమానం ఉన్న గ్రామాలలో ఆర్ ఎస్సై , 12 మంది స్పెషల్ పార్టీ పోలీసులచే దాడులు చేస్తున్నామన్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ , అక్రమంగా మద్యం రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్టులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News