హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అక్కడ రాత్రయితే జనానికి కునుకులేదు.. ఆదమరిస్తే అంతే సంగతులు..!

అక్కడ రాత్రయితే జనానికి కునుకులేదు.. ఆదమరిస్తే అంతే సంగతులు..!

కర్నూలులో దొంగల ముఠా అరెస్ట్

కర్నూలులో దొంగల ముఠా అరెస్ట్

కర్నూలులో ఇటీవల వరుస దొంగతనాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 9 లక్షలు విలువ చేసే బంగారు, వెండి. స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు డిఎస్పీ మహేష్ తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

కర్నూలు (Kurnool) లో ఇటీవల వరుస దొంగతనాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 9 లక్షలు విలువ చేసే బంగారు, వెండి. స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు డిఎస్పీ మహేష్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో నాలుగవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగల ముఠా అరెస్టుకు సంబంధించి సీఐ శంకరయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వీఆర్ కాలనీ సమీపంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మమత నగర్ కుచెందిన చాకలి అరవింద్, పోలీసు క్వార్టర్ కుచెందిన ఆకుల మహే ష్ బాబు, తిలక్ నగర్ కు చెందిన వడ్డే రాజశేఖర్ నుఅరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.5 గ్రాముల బంగారం, 435 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఈ ముగ్గురు నిందితులను నాలుగవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి స్టేషన్ పరిధిలో దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.9 లక్షల ఆభరణాలు 5 వెండి ఆభరణాలను చోరి జరిగిన సంబంధిత యజమానులకు అందజేస్తాము అని కర్నూల్ డీఎస్పీతెలిపారు . ప్రధానంగా నగరంలో చోరి ముఠాకు . సంబంధించి సాంకేతికతో ముందుకు వెళ్తుతున్నామని అందులో భాగంగానే 4వ పట్టణ సీఐ శంకరయ్య, తన సిబ్బందితో నిత్యం తనిఖీలు చేయడంతోనే తన పరిధిలో 5 చోరి కేసులకు పాల్పడిన ముఠాలను అరెస్టు చేయడంతోనే బంగారు, వెండి ఆభరణాలుస్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఇది చదవండి: ఒక్కోసారి సాయం కూడా శాపంగా మారుతుంది.. ఈ యువకుడికి అదే జరిగింది..

అరెస్టు అయిన ముఠాలపైన పూర్తి స్థాయిలో విచారిస్తున్నామన్నారు. వారి వద్ద నుంచి 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఒక కేసుకు సంబంధించి 25 గ్రాముల రాంగ్ గొలుసు, 215 గ్రాముల సిల్వర్ గొలుసు, కర్నూలునాలుగవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఏడాదిలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి 20 గ్రాములు నక్లీసు, 10 గ్రాముల ఆభరణాలు, మూడవ కేసుకు సంబంధించి 25 గ్రాముల గొలుసుతో పాటు నాలుగవ కేసుకు సంబంధించి కూడ 20 గ్రాముల పూసల గొలుసు, 10 గ్రాములు బంగారు సాధారణ గొలుసు,175 గ్రాములవెండిని రికవరీచేశామన్నారు . 5వ కేసుకు సంబంధించి 30 గ్రాముల బంగారు గొలుసును రికవరీ చేశామన్నారు. నాలుగవ పట్టణపోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేయడంతోనే లక్షలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు