హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: రాజధాని కోసం కర్నూలు.. స్థానికుల డిమాండ్లు ఇవే

Kurnool: రాజధాని కోసం కర్నూలు.. స్థానికుల డిమాండ్లు ఇవే

X
కర్నూలులో

కర్నూలులో న్యాయరాజధాని కోసం ఉద్యమం

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు (Kurnool) ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు (Kurnool) ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. కర్నూలు పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కర్నూలు రాజవిహార్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు 800 మంది విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టింది. 2012 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారు. గతంలో తమిళనాడు, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు రాయలసీమ ప్రాంతమైన కర్నూలు రాజధానిగా ఉండేది. అప్పుడు తమిళనాడు విభజనలో భాగంగా కర్నూలు రాజధానిని హైదరాబాద్ కు మార్చారు అనంతరం శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని కోల్పోయిన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే విధంగా ఆ నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

అప్పటి నుంచి ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాష్ట్ర విభజన దాక కర్నూలులో హైకోర్ట్ సంబందించి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరగలేదు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక రాజధాని కాస్త అమరావతిలో ఏర్పాటు చేయడం కర్నూలుకు హైకోర్టుకు బదులుగా బెంచ్ఏర్పాటు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ మొండి చెయ్యి చూపించింది. దీంతో రాయలసీమ కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తితో పెద్ద ఎత్తున ఆందోళనలు చెప్పటారు.

ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యే భర్త హత్య కేసులో ట్విస్ట్.. కులసంఘాల ఎంట్రీతో హైడ్రామా..!

మళ్ళీ 2019 ఎన్నికల సమయంలో ప్రజలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( YCP) నేత జగన్ మోహన్ రెడ్డి కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని హామీ ఇవ్వడంతో కర్నూలు జిల్లా ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. మొత్తం. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఎలాంటి అభివృద్ధి కానీ చేయకపోవడంతో కర్నూలు జిల్లాలోని న్యాయవాదులంతా విధులను బహిష్కరించి పెద్ద ఎత్తునజిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

ఇంకా చేసేదేమి లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 19వ తేదీన కర్నూలులో జ్యూడిషల్ అకాడమీ ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేసింది. జ్యూడిషియల్ ఆకాడమీ ఏర్పాటుపై జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొంతమంది జిల్లా వాసులు గతంలో టీడీపీ ప్రభుత్వం బెంచ్ ఏర్పాటు చేస్తామని చేప్పి మొండి చెయ్యి చూపించిన విధంగా కాకుండా ఈసారైన హైకోర్టు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు.

First published:

Tags: Andhra Pradesh, Ap capital, Kurnool, Local News

ఉత్తమ కథలు