హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: వైఎస్ఆర్‌ చేయూత పథకం తమ జీవితాలనే మార్చేసిందన్న మహిళలు..! మూడో విడత పంపిణీతో మరింత సాయం..!

Kurnool: వైఎస్ఆర్‌ చేయూత పథకం తమ జీవితాలనే మార్చేసిందన్న మహిళలు..! మూడో విడత పంపిణీతో మరింత సాయం..!

కర్నూలులో

కర్నూలులో వైఎస్ఆర్ చేయుత పంపిణీ

Kurnool: కర్నూల్ మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో వైఎస్సార్ చేయూత మూడో విడత పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లాలో 1,24,045 మంది మహిళ లబ్ధిదారులకు 232.58 కోట్ల రూపాయలను… అదే విధంగా నంద్యాల జిల్లాలో 94989 మంది మహిళల లబ్ధిదారులకు 178.10 కోట్ల రూపాయలను అందించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  వైఎస్సార్ చేయూత (YSR Cheyutha Scheme) మూడో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 45 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా ఎవరిపై ఆధారపడి జీవించకుండా స్వశక్తితో ఎదగాలనే లక్ష్యంతోనే సీఎం జగన్‌ వైయస్సార్ చేయూత పథకం ప్రారంభించారు. కర్నూల్ మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో వైఎస్సార్ చేయూత మూడో విడత పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లాలో 1,24,045 మంది మహిళ లబ్ధిదారులకు 232.58 కోట్ల రూపాయలను… అదే విధంగా నంద్యాల జిల్లాలో 94989 మంది మహిళల లబ్ధిదారులకు 178.10 కోట్ల రూపాయలను అందించారు.

  ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా (Chittoor District) లోని కుప్పం (Kuppam) లో బటన్ నొక్కడంతో అర్హులైన మహిళల ఖాతాల్లో నేరుగా ఎక్కడా కూడా ఎటువంటి అవినీతికి చోటు లేకుండా వైఎస్సార్ చేయూత కింద వారి అకౌంట్లో నగదు జమ అయింది. దీంతో వైయస్సార్ చేయూత మూడో విడత పంపిణీ కార్యక్రమంతో కలెక్టర్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో పండగ వాతావరణం మధ్య ముగిసింది.

  ఇది చదవండి: విద్యార్థులకు శుభవార్త..! కర్నూలు ఉర్దూ యూనివర్సిటీలో వెబ్‌ ఆప్షన్స్‌ ప్రారంభం..!త్వరపడండి..!

  కర్నూలు మండలం రుద్రావరం గ్రామానికి చెందిన జయమ్మ ఆ జిల్లాలోని వైస్సార్ చేయూతలో మొట్టమొదటి లబ్ధిదారురాలు. ఒకప్పుడు పొలం పని చేసుకోని జీవనం సాగించేవాళ్లమని..అప్పుడు తమ కుటుంబం ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడేవాళ్ళమని జయమ్మ తెలిపింది. కానీ, నవరత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా.. తనకు వైఎస్సార్ చేయూత కింద చేసిన ఆర్థిక సాయంతో కిరాణా షాపు పెట్టుకున్నట్లు తెలిపింది.

  ఇది చదవండి: హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో ఉద్యోగ అవకాశాలు..! డిగ్రీ అర్హతతో రూ.2 లక్షల వేతనం..!

  ఇప్పుడు తన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నట్లు కలెక్టర్‌కు తెలిపింది. అలాగే మేము కిరాణం సరుకులు పట్టణాలకు వెళ్లి తెచ్చుకోకుండా జియో మార్ట్ వాళ్ళతో తమను లింక్ చెయ్యడంతో ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు లేకుండా చేశారు. ఇలా మహిళ కష్టాలను అర్ధం చేసుకొని సంక్షేమ పథకాలతో తమను అన్నివేళలా ఆదుకుంటూ అన్నలా తోడున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని జయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు.

  అంబేద్కర్ నగర్ దిన్నెదేవరపాడుకు చెందిన వెంకట లక్షమ్మ అనే మహిళ కూడా తన జీవితంలో వైఎస్సార్‌ చేయూత ఆర్థిక సాయం చేసిన మార్పును అందరితో పంచుకున్నారు. గతంలో తాము కూలి పని చేసుకొని జీవించేవాళ్లమని..కానీ ఇప్పుడు వైస్సార్ చేయూత పథకంతో లబ్దిపొందుతున్నామని తెలిపారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News, Ysr Cheyutha Scheme

  ఉత్తమ కథలు