హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tasty Mutton: అక్కడి మటన్ ఎందుకంత రుచి..! కారణం తెలిస్తే వారెవ్వా అంటారు..!

Tasty Mutton: అక్కడి మటన్ ఎందుకంత రుచి..! కారణం తెలిస్తే వారెవ్వా అంటారు..!

నాన్ వెజ్ లవర్స్ కు బిగ్ షాక్

నాన్ వెజ్ లవర్స్ కు బిగ్ షాక్

చికెన్ (Chicken), మటన్ (Mutton), చేపలు (Fish) లాంటి నాన్ వెజ్ వంటకాలకు (Non-Veg Dishes) వేటికవి ప్రత్యేక రుచులున్నా.. వంట చేసే విధానాన్ని బట్టి రుచిమారుతుంటుంది. మటన్ అయితే ఎక్కడ తిన్నా ఒకటే టేస్ట్. అందులో వాడే పదార్థాలు, వంట తీరును బట్టి టెస్ట్ లో తేడా రావొచ్చు. కానీ కర్నూలు జిల్లాలో దొరికే పొట్టేలు మాంసం మాత్రం చాలా డిఫరెంట్.

ఇంకా చదవండి ...

  చికెన్ (Chicken), మటన్ (Mutton), చేపలు (Fish) లాంటి నాన్ వెజ్ వంటకాలకు (Non-Veg Dishes) వేటికవి ప్రత్యేక రుచులున్నా.. వంట చేసే విధానాన్ని బట్టి రుచిమారుతుంటుంది. మటన్ అయితే ఎక్కడ తిన్నా ఒకటే టేస్ట్. అందులో వాడే పదార్థాలు, వంట తీరును బట్టి టెస్ట్ లో తేడా రావొచ్చు. కానీ కర్నూలు జిల్లాలో దొరికే పొట్టేలు మాంసం మాత్రం చాలా డిఫరెంట్. రాష్ట్రంలో ఎక్కడ మటన్ తిన్నా ఈ టెస్ట్ మాత్రం రాదని స్తానికులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా (Kurnool District) కేంద్రానికి 70కిలోమీటర్ల దూరంలో ఉన్న పెబ్బేరు గ్రామం పొట్టేళ్లకు చాలా ఫేమస్. ఇక్కడి పొట్టేళ్లు ఇతర ప్రాంతాలతో పోలిస్తే భిన్నమైన రుచిని కలిగి ఉంటాయట. ఇక్కడ ప్రతి శనివారం పొట్టేళ్ల సంత జరుగుతుంది. అలాగే జిల్లాలోని పత్తికొండ, నందికొట్కూరు కూడా సంతలు జరుగుతాయి.

  స్థానిక మాంస విక్రయదారులు ఈ మూడు ప్రాంతాల నుంచి వారం రోజులకు సరిపడే పొట్టేళ్లు తెచ్చుకుని కోస్తుంటారు. ఈ ప్రాంతంలో నెల్లూరు జుడిపి, నెల్లూర్‌ బ్రౌన్‌ అనే రెండు రకాల జాతి పొట్టేళ్లు లభిస్తాయి. పైగా పొట్టేలు మాంసంలో కరోనా నిరోధించే శక్తి ఎక్కువ. ఇందులో ఒక ప్రత్యేక ఎంజైమ్‌ ఉంటుంది. కోడి మాంసంలో అది లభించదు. ఇక్కడి పొట్టేళ్లు సారవంతమైన నేలల్లో మేస్తాయి. ఈ నేలల్లో వాటికి మంచి పోషకాహారాలు లభిస్తాయి.

  ఇది చదవండి: ఇక్కడున్నది చీరలు,నగలు అనుకుంటే మీ పొరబాటే..! సరిగ్గాచూస్తే షాక్ అవుతారు..


  పక్కనే ఉన్న అనంతపురం జిల్లాలో పొట్టేలు మాంసం బాగా లభించినా.. అక్కడి మాంసం కంటే కర్నూలు జిల్లాలో లభించే మాంసమే నాణ్యతగా, రుచిగా ఉంటుందని శాస్త్రీయంగా కూడా నిర్ధారణ అయింది. అనంతపురంలోని పొట్టేళ్లలో కర్ణాటక ప్రాంతంలోని మాండియా బ్రీడ్‌ కలుస్తుంటుంది. పొట్టేళ్ల సంతాన ఉత్పత్తి సమయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆడ పొట్టేలు కానీ లేక మగ పొట్టేలు కానీ మాండియా బీడ్‌కు చెందినదైతే సంతానోత్పత్తి ద్వారా వచ్చిన పొట్టేలు మాంసంలో రుచి ఉండదు. అందువల్ల ధరల్లోనూ తేడా ఉంటుంది. అనంతపురంలో కిలో రూ. 400కు పలికితే.. కర్నూలు పొట్టేలు మాంసం మాత్రం రూ. 700 పలుకుతుంది.

  ఇది చదవండి: భూమిలో నుంచి వింత శబ్ధాలు.. హడలిపోతున్న ఊరిజనం.. దెయ్యాలు పగబట్టాయా..?


  హైదరాబాద్ లోని చెంగిచెర్లలో జాతీయ పరిశోధనా కేంద్రానికి కర్నూలు నుంచే మాంసం వెళ్తుంటుంది. ఇక్కడి శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం కర్నూలు మాంసాన్నే వినియోగిస్తారు. అంతేకాదు అదే సంస్థలోని ఔట్ లెట్ లో కర్నూలు మాంసాన్నే విక్రయిస్తారు. అయితే కర్నూలు పొట్టేలు మాంసానికి ఇంత రుచి, ప్రత్యేకత రావడానికి గడ్డిమేతే కారణమని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే నేల సారవంతమైనదని.. ఇక్కడి గడ్డి ప్రత్యేకత వల్లే పొట్టేళ్లు విభిన్న రుచిని సంతరించుకున్నాయని వెల్లడించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Mutton

  ఉత్తమ కథలు