KURNOOL KURNOOL MUSEUM WILL GIVE LIVE EXPERIENCE ABOUT ANCIENT RAYALASEEMA HISTORY FULL DETAILS HERE PRN KNL NJ
Kurnool News: రాయలసీమ రతనాల సీమ ఎలా అయింది..? చరిత్ర తెలియాలంటే అక్కడికి వెళ్లాల్సిందే..!
మ్యూజియంలోని పురాతన కత్తులు
ఒక ప్రాంత చరిత్ర తెలియాలంటే ఆ ప్రాంతానికి చెందిన పురాతన ఆనవాళ్లు, ప్రాచీన వస్తువులే సాక్ష్యం. అక్కడి భాష, వ్యవహార శైలీ, అలవాట్లు తెలియాలంటే చారిత్రక అవశేషాలే ఆధారం. అలాంటి ఆధారాలు అన్ని ఒకచోట కొలువుదీర్చేవే పురావస్తు ప్రదర్శనశాలలు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పురాతన మ్యూజియాల్లో కర్నూలు (Kurnool) పురావస్తు మ్యూజియం ప్రత్యేకమైనది.
ఒక ప్రాంత చరిత్ర తెలియాలంటే ఆ ప్రాంతానికి చెందిన పురాతన ఆనవాళ్లు, ప్రాచీన వస్తువులే సాక్ష్యం. అక్కడి భాష, వ్యవహార శైలీ, అలవాట్లు తెలియాలంటే చారిత్రక అవశేషాలే ఆధారం. అలాంటి ఆధారాలు అన్ని ఒకచోట కొలువుదీర్చేవే పురావస్తు ప్రదర్శనశాలలు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పురాతన మ్యూజియాల్లో కర్నూలు (Kurnool) పురావస్తు మ్యూజియం ప్రత్యేకమైనది. రాయలసీమ (Rayalaseema) చారిత్రిక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో కర్నూలు జిల్లా ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది. కర్నూలు నగరంలోని బూదవరపుపేటలో ఉన్న పురావస్తు మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. హంద్రీ నది కుడి ఒడ్డున నిర్మించిన ఈ భవనం 31-8-1999న ప్రజల కోసం ప్రారంభించారు. దాదాపు రెండున్న దశాబ్దాలుగా కర్నూలు చరిత్రను సందర్శకులకు అందిస్తోందీ మ్యూజియం.
మ్యూజియంలో కర్నూలు చరిత్ర ఆనవాళ్లు
భారత పురావస్తు శాఖ వారు కర్నూలు మ్యూజియాన్ని స్థాపించారు. ‘L’ ఆకారంలో ఉన్న మ్యూజియం హాల్లోని గాజు షోకేసులలో చాలా పురాతన వస్తువులు ప్రదర్శించబడ్డాయి. కర్నూల్ ప్రాంతం నుండి త్రవ్విన ఎన్నో కళాఖండాలతో కర్నూలు ప్రాంతం చారిత్రక పురావస్తు ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యూజియాన్ని నిర్మించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ పక్కనే, హంద్రి నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది.
వస్తువులుసేకరించిన ప్రదేశాలు
శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని ముంపు గ్రామాల నుండి సేకరించిన పురాతన వస్తువులు మరియు చాళుక్యుల కాలం నుండి విజయనగర కాలం చివరి వరకు ఉన్న రాతి శిల్పాలు, కాంపౌండ్ వాల్ లాంటివి మ్యూజియం హాలులో మరియు చుట్టుపక్కల సిమెంట్ పీఠాలపై ప్రదర్శించబడ్డాయి. సంగమేశ్వరం, ఆలంపూర్, శ్రీశైలం వంటి సమీప ఆలయాలకు చెందిన విరిగిన శిల్పాల వంటి కళాఖండాలు, సామంత రాజులు ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. నగరానికి సమీపంలోని కేతవరం వద్ద ఆదిమానవుల ఆనవాళ్లు లభించాయి. జుర్రేరు లోయ, కటవారికుంట, యాగంటి తదితర ప్రాంతాల్లో ఎన్నోపురాతన శిల్పాలు లభించాయి. వాటన్నిటిని చూడాలంటే ఈ పురాతన మ్యూజియాన్ని సందర్శించాల్సిందే.
ఇది చదవండి: ప్రభాస్ థియేటర్లో ఫారిన్ పెళ్లి.. వధువు తండ్రి వినూత్న ఆలోచన.. సిల్వర్ స్క్రీన్ పై మ్యారేజ్..
ఎన్నో పురాతన శిల్పాలకు నెలవు
శతాబ్దాల క్రితం నాటి ప్రాచీన ఆనవాళ్లు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పుచాళుక్యులు, విష్ణుకుండినీలు, మొగల్ కాలంనాటి ప్రాచీన వస్తువులెన్నో ఇక్కడ చూడవచ్చు. శాతనకోట, సంగమేశ్వరం, ప్రాతకోట, ఎర్రమటం ముసలిమొడు, మాడుగుల…ఇలా ఇతర ప్రాంత శిలావిగ్రహాలతో ఈ ప్రాంగణం ఎన్నో చారిత్రక గాథలు చెబుతోంది.
రాజుల కాలం నాటి ద్వారాలు, లింటెల్(lintel), శాసనాలు మొదలైన వాటిని ఈ పురావస్తు ప్రాంగణంలో ఉంచారు. మ్యూజియంలో ప్రీ, ప్రోటో మరియు ఎర్లీ హిస్టారిక్, పురావస్తు కళాఖండాలు, కుండలు, శిల్పాలు, కంచులు, ఆయుధాలు, పెయింటింగ్‌లు మరియు శాసనాలు కూడా ఉన్నాయి. మ్యూజియంలో మధ్య రాతియుగం, బృహత్ శిలాయుగం పనిముట్లు, గొడ్డళ్లు, వడిసెల రాయి, మట్టి బొమ్మలు, రోమన్, శాతవాహన, ఇక్ష్వాకుల నాణేలు, సింహ అవధాన జాతక పెన్సిల్ చిత్రకల, బ్రిటిష్-ఇండియా వెండి నాణేలు, కుతుబ్ సహరి వెండి నాణేలు తదితర వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి.
మ్యూజియం టైమింగ్స్
2009 వరదల సమయంలో మ్యూజియంలోని దాదాపు 1000కిపైగా వస్తువులు దెబ్బతినడంతో.. దాన్ని ప్రభుత్వం మరమ్మత్తులు చేయించి అభివృద్ధి చేసి..కొత్తహంగులతో మళ్లీ 2015 నుంచి సందర్శలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మ్యూజియం ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు తెరిచి ఉంటుంది. శుక్రవారాలు మరియు పబ్లిక్ హాలిడేస్ లో క్లోజ్ చేస్తారు. మ్యూజియం షాప్ మరియు దాని కౌంటర్ ప్రవేశ సముదాయంలో ఉన్నాయి. పెద్దలకు రూ.3/-, పిల్లలకు రూ.1/-
మ్యూజియానికి ఎలా వెళ్లాలి?
కర్నూలు నగరంలోనే ఈ మ్యూజియం ఉంది. కర్నూలుకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి ఆటోలో అక్కడకు వెళ్లొచ్చు. ఈ మ్యూజియం కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకానికి సమీపంలో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.