హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: బిడ్డ బర్త్ డే ఘనంగా చేయలేదని అలా చేస్తారా..? పేగు బంధాన్ని మరిచిన కన్నతల్లి

Andhra Pradesh: బిడ్డ బర్త్ డే ఘనంగా చేయలేదని అలా చేస్తారా..? పేగు బంధాన్ని మరిచిన కన్నతల్లి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కుమారుడి ప్రాణాలకంటే ఆ తల్లికి పుట్టిన రోజు వేడుకలే ఎక్కువయ్యాయి. క్షణికావేశంలో కన్నపేగు బంధాన్ని కూడా మరిచింది.

సాధారణంగా మహిళలకు ఫంక్షన్లు చాలా గ్రాండ్ గా చేసుకోవడం అంటే ఇష్టం. అలా చేస్తే తమ స్టేటస్ అందరికీ తెలుస్తుందని పలువురు భావిస్తుంటారు. ఆడంబరాలు, వేడుకల మాయలో పడిన ఓ తల్లి కన్నపేగు బంధాన్ని మరిచింది. కన్నకొడుకు పుట్టినరోజు ఘనంగా చేయలేదన్న కోపం.. అభం శుభం తెలియని పసివాడ్ని పొట్టనబెట్టుకుంది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన రైతు సుధాకర్ కు సొంత అక్క కూతురు మౌనికతో మూడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఏడాది వయసున్న విక్రమ్ అనే కుమారుడున్నాడు. సుధాకర్ కు అన్న కుమారడి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మౌనిక కూడా విక్రమ్ బర్త్ డేని ఘనంగా చేయాలని భర్తను కోరింది. ఈ క్రమంలో 26 విక్రమ్ బర్త్ డే వేడుకలను సాదాసీదాగా చేశారు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక భర్తతో గొడవపడింది.

ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయలు కోసే కత్తితో విక్రమ్ గొంతుకోసింది. దీంతో ఆ పసివాడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరు బంధువులు తనను ఏమైనా చేస్తరాన్న భయంతో మౌనిక కూడా పరుగుల మందుతాగి ఆత్మహత్యయత్నం చేసింది. అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకుంటుండగా స్థానికులు గుర్తించారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో విక్రమ్ కనిపించాడు. కుటుంబ సభ్యులు మౌనికను ఆస్పత్రకి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడా ఉంది.

కరోనా సమయం కావడం, ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా వేడుకలు ఘనంగా చేయలేదని సుధాకర్ కుటుంబం చెప్తోంది. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడుతుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఐతే మౌనిక ఇంతటి దారుణానికి పాల్పడటానికి పుట్టిన రోజు వేడుకలే కారణమే మరేదైనా ఉందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అటు బంధువులు మాత్రం మౌనికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉంటే భర్తతో తేల్చుకోవాలిగానీ కన్నకొడుకు పొట్టుబెట్టుకోవడంపై మండిపడుతున్నారు. మరోవైపు నిర్జీవంగా ఉన్న చిన్నారి విక్రమ్ ను చూసి తండ్రి సుధాకర్ కన్నీరుమున్నీరవుతున్నాడు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Mother killed her baby, Murder

ఉత్తమ కథలు