హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 48 గంటలపాటు లాయర్ల నిరాహారదీక్ష..! ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ హెచ్చరిక..!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 48 గంటలపాటు లాయర్ల నిరాహారదీక్ష..! ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ హెచ్చరిక..!

కర్నూలులో

కర్నూలులో లాయర్ల ఆందోళన

కర్నూల్ (Kurnool) నగరంలోని ధర్నా చౌక్ నందు రాయలసీమ ప్రాంత ప్రజల హక్కుల సాధనకై న్యాయవాదుల ఆత్మగౌరవ పోరాటం చేపట్టారు శ్రీ భాగ్ ఒప్పందంలో భాగంగా హైకోర్టు (High Court) రాజధాని అమరావతి (Capital Amaravathi) నుండి కర్నూలు తరలింపు కోసమే న్యాయవాదులు 48 గంటలు నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  కర్నూల్ (Kurnool) నగరంలోని ధర్నా చౌక్ నందు రాయలసీమ ప్రాంత ప్రజల హక్కుల సాధనకై న్యాయవాదుల ఆత్మగౌరవ పోరాటం చేపట్టారు శ్రీ భాగ్ ఒప్పందంలో భాగంగా హైకోర్టు (High Court) రాజధాని అమరావతి (Capital Amaravathi) నుండి కర్నూలు తరలింపు కోసమే న్యాయవాదులు 48 గంటలు నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. అదేవిధంగా నీళ్లు, నిధులు నియామకాల్లో సమాన మైన వాటా కల్పించాలని విద్యా వైద్య పారిశ్రామిక సేవరంగాల్లో సమాన వాటాకై సమగ్రమైన బిల్లు ద్వారా చట్టం చేయాలని జిల్లా న్యాయవాదుల సంఘం ప్రధాన డిమాండ్ చేశారు. కర్నూల్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ రామనాథ్ మాట్లాడుతూ మా కోరిక మేరకు రాయలసీమ వాసులు న్యాయవాదులు అందరూ అత్యున్నత న్యాయస్థానం రావాలని అందరు కోరుకోవాలని తెలియజేశారు.

  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం రాజ్యాంగ హక్కుని న్యాయవాదులు ముక్తకంఠంతో వాదిస్తున్నారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులకు బహిష్కరణ చేసి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలుకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా తగ్గించాలంటే హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. హైకోర్టు తరలింపును అడ్డుకునే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తెలియజేస్తామన్నారు.

  ఇది చదవండి: ఆస్పత్రి సూపర్‌వైజర్‌కే వైద్యం అందలేదు.. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా..? ప్రభుత్వాస్పత్రిలో ఘోరం..

  హైకోర్టు తరలింపు కోసం వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు విధులను బహిష్కరించి.. తమ ఆందోళన తెలియ జేస్తామన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.., 1954లోని శ్రీబాగ్ ఒడంబడికలో చెప్పడం జరిగింది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలును రాజధాని చేయకుండా అమరావతిని చేశారు. ఇప్పటికే రాజధాని కోల్పోయి కర్నూలు చాలా అన్యాయానికి గురైందని అన్నారు.

  ఇది చదవండి: స్నేహమంటే ఇదేరా..! స్నేహితుడికి గుర్తుగా.. వీల్లేం చేశారో మీరే చూడండి..

  కర్నూలు జిల్లా పూర్తిగా కరువు జిల్లాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అలాంటి జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు, నిధులు రాక, నీళ్లు లేక రైతాంగం, కర్షక రంగం ఇబ్బందుల్లో ఉందన్నారు. అలాంటి జిల్లా కేంద్రంలో హైకోర్టు ఏర్పాటు చేస్తే కొంతైనా న్యాయం జరుగుతుందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ , అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలు ద్వంద వైఖరి వహిస్తూ ప్రజలను పిచోళ్ళని చేస్తున్నారు అని మండిపడ్డారు.

  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయని పక్షంలో సుదీర్ఘకాల ఆందోళనలకు సిద్ధమవుతావని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడబొమని హెచ్చరించారు. రాజధానికి సంబంధం లేకుండా శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును కర్నూలు నగరంలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరానికి చరిత్ర లేకుండా చేస్తున్నారని అధికార ప్రతిపక్ష పార్టీలపై న్యాయ వాదులు దుమ్మెత్తి పోశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP High Court, Kurnool, Local News

  ఉత్తమ కథలు